Representational Image (File Photo)

Mumbai, Mar 30: భార్య తన ప్రియుడితో పారిపోయిందనే (Wife Runs Away With Lover) కోపంతో ఓ భర్త ఆమె తండ్రి తన మామను దారుణంగా తుఫాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ ఘటన (Maharashtra Shocker) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా జిల్లాలోని పైఠాన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవల ప్రియుడితో కలిసి ఔరంగాబాద్‌(Aurangabad)కు పారిపోయింది.

దీంతో ఆగ్రహానికి గురైన అతడు అంబాద్‌లో నివాసముంటున్న ఆమె తండ్రి వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అతడి కుమార్తె మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంపై నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.

పుల్లుగా తాగి ఇండిగో విమానంలో పాడు పని చేసిన ప్రయాణికుడు, అందరి ముందు మూత్రవిసర్జన చేస్తూ వాంతులు చేసుకుని రచ్చరచ్చ

గొడవ తీవ్రం కావడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో తన మామను కాల్చి చంపి (Man Shoots Dead Father-In-Law) అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడిక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.