Viagra (Wikimedia Commons)

Nagpur, July 5: సెక్స్ లో ఎక్కువ సేపు ఉండాలని చాలామంది వయాగ్రా వాడుతుంటారు.అయితే అది కొన్ని సార్లు చాలా ప్రమాదకరం అవుతుంది. ఎక్కువ డోస్ తీసుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. తాజాగా అలాంటి ఘటనే నాగపూర్ లో చోటు చేసుకుంది. ఈ విచిత్రమైన సంఘటనలో... నాగపూర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావోనర్ ఆధారిత హోటల్‌లో 25 ఏళ్ల వ్యక్తి ‘వయాగ్రా ఓవర్‌డోస్’ కారణంగా మరణించినట్లు ( Viagra overdose kills ) పోలీసులు తెలిపారు. మృతుడిని అజయ్‌ పార్టేకిగా గుర్తించారు. ఇతరులతో గే సెక్స్‌కు అలవాటు పడిన లా విద్యార్థి, ఆ దృశ్యాన్ని వీడియో తీసి డబ్బులు బ్లాక్ మెయిల్, తట్టుకోలేక అతన్ని చంపేసిన సహచర గేలు, యూపీలో దారుణ ఘటన

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, అజయ్ తన మహిళా స్నేహితురాలితో కలిసి ఆదివారం సాయంత్రం సావోనర్‌లోని కేశవ్ లాడ్జికి వెళ్లాడు. ఇద్దరూ సంభోగం సమయంలో, అజయ్ గదిలో కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలో (25-year-old man in lodge near Nagpur) పడిపోయాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన యువతి తమ కామన్‌ ఫ్రెండ్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల విచారణలో అజయ్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. అయితే అతని జేబులో వయాగ్రా మాత్రలు ఉన్నాయి. వయాగ్రా మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అజయ్‌ మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపి కేసు నమోదు చేశారు.