Sexually Harassed: అడ్రస్ అడిగి మహిళ ముందు ప్యాంటు జిప్పు విప్పిన ఆకతాయి, ఢిల్లీ మెట్రో స్టేషన్ లో ఘటన, క్యాబ్ కోసం వేచి చూస్తున్న మహిళతో అసభ్య ప్రవర్తన, యువతి ట్వీట్లతో రంగంలోకి పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్

మెట్రో స్టేషన్‌లో కూర్చొన్న ఆమె వద్దకు వచ్చి అడ్రస్‌ గురించి మళ్లీ అడిగాడు. ఆమె దాని గురించి చెబుతుండగా తన ప్రైవేట్‌ భాగాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడి లైంగిక వేధింపులకు(Sexually Harassing) భయపడిన ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేసింది. సమీపంలో ఉన్న పోలీస్‌ సహాయం కోరినా పట్టించుకోలేదని ఆరోపించింది.

Delhi Metro | Representational Image (Photo Credits: PTI)

New Delhi, July 06: ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోస్టేషన్‌ లో ఓ ఆకతాయిని అరెస్ట్ చేశారు. మెట్రో స్టేషన్‌లో (Metro) కూర్చొన్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. తన ప్రైవేట్‌ భాగాన్ని చూపించి అభస్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌(Delhi Metro Station)లో ఈ సంఘటన జరిగింది. జూన్‌ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్‌ గురించి అడిగాడు. ఆ అడ్రస్‌ గురించి చెప్పిన ఆమె జోర్‌ భాగ్‌ (JorBagh) మెట్రో స్టేషన్‌లో దిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఒక చోట కూర్చొని క్యాబ్‌ బుక్‌ చేస్తున్నది. కాగా, ఆ వ్యక్తి కూడా అదే స్టేషన్‌లో దిగాడు.

మెట్రో స్టేషన్‌లో కూర్చొన్న ఆమె వద్దకు వచ్చి అడ్రస్‌ గురించి మళ్లీ అడిగాడు. ఆమె దాని గురించి చెబుతుండగా తన ప్రైవేట్‌ భాగాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడి లైంగిక వేధింపులకు(Sexually Harassing) భయపడిన ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఈ ఘటనపై వరుస ట్వీట్లు చేసింది. సమీపంలో ఉన్న పోలీస్‌ సహాయం కోరినా పట్టించుకోలేదని ఆరోపించింది.

Gurugram Shocker: నీ భార్యను పంపితే నా భార్యను పంపుతా, తన సోదరుడితో పడుకోవాలని భార్యకు ఓ భర్త వేధింపులు, తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి 

మరోవైపు మహిళ ట్వీట్లపై స్పందించిన ఢిల్లీ పోలీసులు (Delhi police)ఆ మెట్రో స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను(CCTV) పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడ్ని గుర్తించి తాజాగా అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ సీసీటీవీ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(The above story first appeared on LatestLY on Jul 06, 2022 11:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).