MP Shocker: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడు శృంగారం, వేరే మగవారితో కూడా సంబంధాలున్నాయని అతన్ని దారుణంగా చంపేశాడు, ఆ తర్వాత యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం పెట్టుకుని ఆ రహస్యం బయటపడుతుందేమోనని అతన్ని దారుణంగా హత్య చేశాడు.
Bhopal, July 19: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం పెట్టుకుని ఆ రహస్యం బయటపడుతుందేమోనని అతన్ని దారుణంగా హత్య చేశాడు. అయితే ఆ ట్రాన్స్‌జెండర్‌కు తనతోనే కాకుండా వేరే మగవారితో కూడా సంబంధాలున్నట్టు తెలియడంతో ఈ దారుణానికి (Man murders transgender friend) ఒడిగట్టాడు. తన అసహజ బంధం గురించి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆ యువకుడు ఆ ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేశాడు.. అనంతరం తను ఉరి వేసుకుని ఆత్మహత్య (commits suicide fearing scandal) చేసుకున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెతుల్‌కు చెందిన హరిఓం అనే యువకుడు సరణిలోని ఓ నర్సరీలో వాచ్‌మెన్‌గా ఉండేవాడు. అతను నాగ్‌పూర్‌కు చెందిన నిక్కీ అనే ట్రాన్స్‌జెండర్‌తో స్నేహం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా మొదలైంది. నిక్కీని కలిసేందుకు హరిఓం తరచుగా నాగ్‌పూర్ వెళ్లేవాడు. నిక్కీ ఇతర అబ్బాయిలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్టు ఇటీవల హరిఓంకు తెలిసింది. ఆ విషయమై జూలై 14వ తేదీ రాత్రి నర్సరీలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నిక్కీ గొంతును తాడుతో మెడకు చుట్టి (Man murders transgender) హరిఓం చంపేశాడు. అనంతరం భయంతో హరిఓం కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Jul 19, 2022 10:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

