Mumbai Shocker: సహజీవనం చేస్తున్న యువతిని నరికి చంపి కుక్కర్‌లో ఉడకబెట్టిన వ్యక్తి, ట్రీకట్టర్‌తో ముక్కలు ముక్కలుగా చేసిన కిరాతకుడు, నాలుగు రోజుల క్రితమే హత్య
అపార్ట్‌మెంట్‌లో 56 ఏళ్ల వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన సంచలనం (kills live-in-partner) రేపింది. నిందితుడు మనోజ్ సహాని అనే వ్యక్తి గత మూడేళ్లుగా గీతా నగర్ ఫేజ్ 7లోని గీతా ఆకాష్ దీప్ భవనంలోని 704 ఫ్లాట్ లో సరస్వతి వైద్య (36) అనే మహిళతో కలిసి జీవనం సాగించేవాడు.
Mumbai, June 08: ఢిల్లీలో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్ధావాకర్ ను దారుణంగా హతమార్చి ముక్కలు కోసిన ఆప్తాబ్ పూనావాలా కేసు మరవక ముందే ముంబయి నగర పరిధిలోని థానేలో మరో దారుణం గురువారం వెలుగుచూసింది. ముంబయి పరిధిలోని థానే మీరా రోడ్‌లోని తన అద్దె అపార్ట్‌మెంట్‌లో 56 ఏళ్ల వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన సంచలనం (kills live-in-partner) రేపింది. నిందితుడు మనోజ్ సహాని అనే వ్యక్తి గత మూడేళ్లుగా గీతా నగర్ ఫేజ్ 7లోని గీతా ఆకాష్ దీప్ భవనంలోని 704 ఫ్లాట్ లో సరస్వతి వైద్య (36) అనే మహిళతో కలిసి జీవనం సాగించేవాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతన్ని అరెస్టు చేశారు.
మనోజ్ బోరివాలీలో చిన్న దుకాణం నడుపుతున్నాడు. మనోజ్ తన భాగస్వామి సరస్వతి మృతదేహాన్ని చెట్టు కట్టర్‌తో నరికి (chops body into pieces), ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసులు చెప్పారు. మనోజ్ ఇంట్లో కుళ్లిపోయిన శరీర భాగాలను బట్టి హత్య మూడు-నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన మహిళ మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 08, 2023 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

