Mumbai Shocker: రాత్రి పక్కలో పడుకోనివ్వని భార్య, కోపంతో ఆమె తల పగలగొట్టిన భర్త, అనంతరం పోలీసులకు సరెండర్ అయిన నిందితుడు
మల్వానీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ల జ్ఞానదేవ్ గణపత్ బలదే శుక్రవారం రాత్రి 48 ఏళ్ల భార్య విజయమాలతో గొడవ పడ్డాడు. పక్కన పడుకోనివ్వని ఆమెతో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహంతో రాతి పలకతో భార్య తలపై బలంగా ( Man kills wife by hitting) కొట్టాడు. దీంతో తలపగిలి రక్తం కారి ఆమె చనిపోయింది.
Mumbai, July 18: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి పూట పక్కలో పడుకోనివ్వలేదన్న కోపంతో భార్యను భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలాడ్‌లోని మల్వానీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ల జ్ఞానదేవ్ గణపత్ బలదే శుక్రవారం రాత్రి 48 ఏళ్ల భార్య విజయమాలతో గొడవ పడ్డాడు. పక్కన పడుకోనివ్వని ఆమెతో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహంతో రాతి పలకతో భార్య తలపై బలంగా ( Man kills wife by hitting) కొట్టాడు. దీంతో తలపగిలి రక్తం కారి ఆమె చనిపోయింది. హైదరాబాద్‌లో దారుణం, భార్య ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి భర్త, అడ్డువచ్చిన బంధువుపై కూడా దాడి, పరారీలో నిందితుడు
కాగా, ఈ సంఘటన అనంతరం జ్ఞానదేవ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు. పక్కన పడుకోనివ్వనందుకు ( not letting him sleep next to her) తమ మధ్య ఘర్షణ జరిగిందని, రాతి పలకతో భార్య తలపై కొట్టి ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగుల్లో పడి చనిపోయిన భార్య విజయమాల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన భర్తపై హత్య సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 18, 2022 11:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

