Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

ముంబై, డిసెంబర్ 13: ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుశ్చర్య (Crime) ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి భర్త, అతని స్నేహితుడిపై ఐపీసీ 376(2), 376డి, 506(2), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంబోలి పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. బర్త్‌డే పార్టీ పేరుతో శుక్రవారం నిందితుడు భర్త తన భార్యను స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లిన తర్వాత నిందితుడు తన భార్యకు మత్తుమందు కలిపి డ్రింక్స్ ఇచ్చాడు. అనంతరం బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత తన స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం చేశాడు. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చేసరికి శరీరంపై ఎలాంటి బట్టలు లేవు. భర్తను నిలదీసి అడగ్గా, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు.

ఒమిక్రాన్‌‌కి విరుగుడు ఇంజెక్షన్ వచ్చేసింది, సోట్రోవిమాబ్ ఔషధాన్ని కనుగొన్న బ్రిటన్, కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడి, సోట్రోవిమాబ్ వినియోగానికి ఆమోదం తెలిపిన యుకె

అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయమై భర్తతో భార్య చాలా గొడవపడి కుటుంబ సభ్యులకు చెప్పింది. కేసు గురించి సమాచారం అందుకున్న బాధితురాలి కుటుంబం మరుసటి రోజు శనివారం సమీపంలోని అంబోలి పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు చేరుకుంది , నిందితుడైన భర్త , అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే బాధితురాలి భర్తను, అతని స్నేహితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడిని 3 రోజుల పోలీసు కస్టడీకి పంపింది.