Sotrovimab: ఒమిక్రాన్‌‌కి విరుగుడు ఇంజెక్షన్ వచ్చేసింది, సోట్రోవిమాబ్ ఔషధాన్ని కనుగొన్న బ్రిటన్, కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడి, సోట్రోవిమాబ్ వినియోగానికి ఆమోదం తెలిపిన యుకె

ఒమిక్రాన్ పై భయపడాల్సిన పనేమీలేదని, ఈ కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని (UK approves another antibody treatment) తాము గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్ (Sotrovimab) గా తెలిపింది.

Sotrovimab: ఒమిక్రాన్‌‌కి విరుగుడు ఇంజెక్షన్ వచ్చేసింది, సోట్రోవిమాబ్ ఔషధాన్ని కనుగొన్న బ్రిటన్, కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తోందని వెల్లడి, సోట్రోవిమాబ్ వినియోగానికి ఆమోదం తెలిపిన యుకె
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Britain, Dec 2: డెల్టా వేరియంట్ ధాటికి బెంబేలెత్తిపోయిన దేశాలను తాజాగా ఒమిక్రాన్ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి వెల్లడైంది. భారత్ లోనూ ఒమిక్రాన్ ప్రవేశించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇది ఎంత ప్రమాదకారి అన్నది ఇప్పుడే చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా తెలిపింది.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ పై భయపడాల్సిన పనేమీలేదని, ఈ కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేసే ఔషధాన్ని (UK approves another antibody treatment) తాము గుర్తించినట్టు బ్రిటన్ వెల్లడించింది. ఈ మందు పేరు సోట్రోవిమాబ్ (Sotrovimab) గా తెలిపింది. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ వినియోగానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సోట్రోవిమాబ్ ఇంజెక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా, వారిలో మరణించే ప్రమాదం 79 శాతం తగ్గినట్టు వెల్లడైంది.

భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌, ప్రధాని మోదీ అత్యవసర సమావేశం, ప్రజలందరు మాస్క్‌ ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని సూచన

ఈ మందును నరాల ద్వారా ఎక్కించగా, కరోనా వైరస్ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కరోనా సోకిన తొలినాళ్లలో సోట్రోవిమాబ్ సింగిల్ డోస్ ఇస్తే, మంచి పనితీరు కనబరుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా దీన్ని వాడాలని బ్రిటన్ కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) వెల్లడించింది. సోట్రోవిమాబ్ తో పాటు రోనా ప్రీవ్ ఔషధం కూడా గణనీయంగా ప్రభావం చూపుతోందని ఎంహెచ్ఆర్ఏ తెలిపింది. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను ఈ ఔషధాలు దీటుగా ఎదుర్కొంటాయని పేర్కొంది.

ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

ఈ ఇంజెక్షన్ మన కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి వైరస్‌తో పోరాడుతుంది. క్లినికల్ ట్రయల్‌లో, హై రిస్క్ ఉన్న పెద్దలలో ఒకే డోస్ ఆసుపత్రిలో చేరడంతో పాటు మరణించే ప్రమాదాన్ని 79% తగ్గించింది.MHRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జూన్ రైన్ ఇలా అన్నారు: "ఇది కోవిడ్ -19కి అత్యంత హాని కలిగించే వారిని రక్షించడంలో ప్రభావవంతంగా చూపబడిన మరొక చికిత్సా విధానం. ఈ వినాశకరమైన వ్యాధికి వ్యతిరేకంగా మా పోరాటంలో మరో ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని తెలిపారు. భారీగా పరివర్తన చెందిన కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా సోట్రోవిమాబ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇంకా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఔషధాన్ని తయారు చేసిన కంపెనీ GSK తెలిపింది.

News Source :BBC

(The above story first appeared on LatestLY on Dec 02, 2021 07:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).