Accused Snatches Cop's Gun:అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల గన్ లాక్కున్న నిందితుడు, తలకు తుపాకీ ఎక్కుపెట్టుకొని హైడ్రామా, సినిమా సీన్ ను తలపించిన అరెస్ట్
నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ నుంచి గన్‌ను అతడు లాక్కున్నాడు. (Accused Snatches Cop’s Gun) తొలుత ఆ పోలీస్‌ను బెదిరించాడు. ఆ తర్వాత గన్‌ను తన తలకు ఎక్కుపెట్టుకున్నాడు. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Lucknow, JAN 27: నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ నుంచి గన్‌ను అతడు లాక్కున్నాడు. (Accused Snatches Cop’s Gun) తొలుత ఆ పోలీస్‌ను బెదిరించాడు. ఆ తర్వాత గన్‌ను తన తలకు ఎక్కుపెట్టుకున్నాడు. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. హత్య చేసేందుకు తనపై దాడి చేశారంటూ మనీష్ ప్రజాపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రషీద్, డానిష్, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే డానిష్‌ను అరెస్ట్ చేశారు.
UP : मेरठ में धमकी देने के आरोपी राशिद को पकड़ने पुलिस गई थी। पुलिस के सामने राशिद ने अपनी कनपटी पर तमंचा लगा लिया। आत्महत्या की धमकी दी। पुलिस ने साहस दिखाकर आरोपी को दबोचा, 2 तमंचे बरामद हुए। pic.twitter.com/ToUnzxgmUv
— Sachin Gupta (@SachinGuptaUP) January 27, 2024
కాగా, శనివారం మధ్యాహ్నం రషీద్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ వద్ద ఉన్న గన్‌ను అతడు లాక్కున్నాడు. తొలుత పోలీస్‌ను బెదిరించాడు. తర్వాత తన సహచరుడ్ని విడిపించాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత గన్‌ను తన తలకు గురిపెట్టుకున్నాడు. కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా అక్కడ గుమిగూడారు. దీంతో ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొన్నది. తొలుత పోలీసులు రషీద్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు అతడి నుంచి గన్ తీసుకున్నారు. రషీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(The above story first appeared on LatestLY on Jan 27, 2024 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

