Navi Mumbai: రూ.10 వేలు ఇస్తా నీ భార్యను నాతో పడుకోమను, 80 ఏళ్ల వృద్ధుడి వికృత కోరిక, తట్టుకోలేక వృద్ధుడిని చంపేసిన బాధితుడు, సీసీ టీవీలో రికార్డు కావడంతో దొరికిపోయిన నిందితుడు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారునం చోటు చేసుకుంది. తన భార్యతో పడుకోవాలని ఉందని చెప్పిన 70 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి (Elderly Man Killed for Demanding Sex ) చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించగా సీసీ టీవీ ద్వారా దొరికిపోయాడు.
Navi Mumbai, September 7: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారునం చోటు చేసుకుంది. తన భార్యతో పడుకోవాలని ఉందని చెప్పిన 70 ఏళ్ల వృద్ధుడిని ఓ వ్యక్తి (Elderly Man Killed for Demanding Sex ) చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించగా సీసీ టీవీ ద్వారా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షమాకాంత్ తుకరామ్ నాయక్(80) అనే వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త. ముంబైలో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఆయనకు ఉన్నాయి. ముంబైలోని ఉల్వే ప్రాంతంలో అతడికి చాలా ఆస్తులు, ప్లాట్లు, భూములు ఉన్నాయి.
ఈ క్రమంలో నాయక్‌కు నవీ ముంబై ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తితో (Shopkeeper) పరిచయం ఏర్పడింది. పరిచయమైన వ్యక్తి ఆ ప్రాంతలో చిన్న దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో నాయక్ ప్రతిరోజు నిందితుడి షాప్ దగ్గరకు వెళ్లి.. పలకరిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు ఇలా పలకరింపులు అయిన తర్వాత వృద్ధుడు తనలోని కోరికను బయటపెట్టాడు. పరిచయమైన వ్యక్తి భార్యను అనుభవించాలని ఉందని నేరుగా అతనితోనే చెప్పాడు.
ఆగస్టు 29న నాయక్ అతని షాప్ వద్దకు వచ్చాడు. పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఉన్నట్లుండి నాయక్ ‘‘నీకు పది వేలు ఇస్తాను.. నీ భార్యను నా గోడౌన్‌కు పంపు.. నాకు ఆమెతో గడపాలని ఉంది’’ అని నిందితుడిని కోరాడు. అన్ని రోజులు ఎంతో మంచివాడిగా భావించిన వ్యక్తి ఇంత నిచంగా మాట్లాడేసరికి అతను తట్టుకోలేకపోయాడు. నాయక్‌ను తోసేశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్రంగా గాయలయ్యాయి. ఆ తర్వాత షాప్ షట్టర్ క్లోజ్ చేసి.. నాయక్‌ని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత వృద్ధుడి మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో ఉంచాడు.
ఆగస్టు 31 వరకు నాయక్ మృతదేహాన్ని బాత్రూంలోనే దాచాడు నిందితుడు. దుర్వాసన వచ్చి దొరికిపోతాననే భయంతో ఆగస్టు 31న నాయక్ మృతదేహాన్ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి.. బైక్ మీద తీసుకెళ్లి ఓ కాల్వలో పడేశాడు. అయితే ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డయ్యింది. అయితే అప్పటికే నాయక్ కుటుంబ సభ్యులు.. అతడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే నిందితుడు నాయక్ కుమారుడితో కలిసి వెళ్లి.. అతడు తప్పిపోయినట్లు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 29న ఏం జరిగిందని ఆరా తీయగా.. నాయక్ చివరి సారిగా నిందితుడి షాప్ దగ్గరే కనిపించాడని.. ఆ తర్వాత మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడి షాప్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని (Accused Arrested) అదుపులోకి తీసుకుని విచారించగా.. నాయక్‌ని చంపడానికి గల కారణలు వెల్లడించాడు. అతడిని హత్య చేసిన తర్వాత నాయక్ దుస్తులను, మొబైల్‌ని స్విచ్ఛాఫ్ చేసి పడేసినట్లు తెలిపాడు.
(The above story first appeared on LatestLY on Sep 07, 2021 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

