Naxalites attack: ప్రజాకోర్టులో నలుగురికి ఉరివేసిన మావోయిస్టులు, ఇంటిని బాంబులతో పేల్చివేసిన నక్సల్స్, తమవారికి విషమిచ్చి చంపారన్న ఆరోపణలతో ఘాతుకం

బీహార్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. గయా జిల్లాలో ప్రజాకోర్టును నిర్వహించి, నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరితీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గతంలో మావోయిస్టులను విమిచ్చి చంపారన్న ఆరోపణలతో వారిని ఉరివేసి చంపినట్లు నోటీసు అంటించారు.

Naxalites attack: ప్రజాకోర్టులో నలుగురికి ఉరివేసిన మావోయిస్టులు, ఇంటిని బాంబులతో పేల్చివేసిన నక్సల్స్, తమవారికి విషమిచ్చి చంపారన్న ఆరోపణలతో ఘాతుకం

Bihar November 15: బీహార్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. గయా జిల్లాలో ప్రజాకోర్టును నిర్వహించి, నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరితీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గతంలో మావోయిస్టులను విమిచ్చి చంపారన్న ఆరోపణలతో వారిని ఉరివేసి చంపినట్లు నోటీసు అంటించారు.

బీహార్‌ గయా జిల్లా దుమారియాలోని మోన్‌బార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఏడాది క్రితం మోన్‌బార్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. అయితే ఇది బూటకపు ఘటన అని మావోయిస్టులు చెప్తున్నారు. ఇంటి యజమానులే మావోయిస్టులకు విషమిచ్చి చంపారని, అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో బూటకపు ఎన్‌కౌంటర్ నిర్వహించారని ఆరోపించారు.

దీంతో మావోయిస్టులు ఆ కుటుంబంపై పగ తీర్చుకున్నారు. మోన్‌బార్‌ గ్రామంలో ప్రజా కోర్టు నిర్వహించి శిక్షలు అమలు చేశారు. సర్జూ భోక్తా ఇంటిని డైనమైట్లతో పేల్చివేశారు. ఆయన కుమారులు సత్యేంద్ర సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వారి భార్యల కాళ్లు, చేతులు కట్టేశారు. కళ్లకు గంతలు కట్టి వారి ఇంటి వెలుపల ఉరివేసారు.

అనంతరం ఆ ఇంటి తలుపులకు ఒక నోటీస్ అంటించారు. ఆ కుటుంబం హత్యా కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. నలుగురు మావోయిస్టులు – అమ్రేష్ కుమార్, సీతా కుమార్, శివపూజన్ కుమార్, ఉదయ్ కుమార్‌లను గతంలో విషం ఇచ్చి చంపారని పేర్కొన్నారు. వీరి హత్యలో ఈ కుటుంబ ప్రమేయం ఉన్నదని నోట్‌ రాశారు. ద్రోహులకు కఠిన శిక్షలు విధిస్తామంటూ మావోయిస్టులు అందులో హెచ్చరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

(The above story first appeared on LatestLY on Nov 15, 2021 12:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).