Surgery | Image Used for Representational Purpose (Photo Credits: Pixabay)

Bangalore, July 06: మహిళకు సిజేరియన్‌ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్‌ కత్తిరించాడు. (Doctor Cuts Newborn’s Genitals) ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్‌, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు (New Born) మరణానికి కారణమైన ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలోని దావనాగ్రే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్‌ 17న నెలలు నిండిన అమృత, ప్రసవం కోసం చిగటేరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యింది. సాధారణ డెలివరీ సాధ్యం కాదన్న డాక్టర్లు ఆమెకు సిజేరియన్‌ చేయాలని చెప్పారు.

Health Tips: ఈ హోం రెమెడీస్ ని ఖచ్చితంగా పాటిస్తే నిమిషాల్లో ఎసిడిటీని తొలగిస్తాయి... 

కాగా, శుక్రవారం అమృతకు సిజేరియన్‌ డెలివరీ సందర్భంగా డాక్టర్‌ పొరపాటున నవజాత శిశువు ప్రైవేట్‌ భాగాన్ని (Doctor Cuts Genitals) కత్తిరించాడు. ఈ నేపథ్యంలో పసిబాబు ఆరోగ్యం విషమించడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో అమృత కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ నిజాముద్దీన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డ చనిపోయినట్లు అమృత, ఆమె భర్త అర్జున్‌ ఆరోపించారు. ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.