NGT Imposes Fine On Bihar Govt: బీహార్ ప్రభుత్వానికి రూ. 4వేల కోట్లు జరిమానా, రెండు నెలల్లో చెల్లించాలంటూ ఎన్జీటీ ఆదేశాలు
బిహార్ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నితీశ్ కుమార్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. రూ. 4,000కోట్ల జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టనందుకు గానూ.. రెండు నెలల్లో రూ. 4 వేల కోట్లను చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. ఘన, ద్రవరూప వ్యర్థాల శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించటంలో విఫలమైనందుకు రూ.4,000 కోట్ల జరిమానా విధించింది.
Patna, May 05: బిహార్ (Bihar) ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నితీశ్ కుమార్ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. రూ. 4,000కోట్ల జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టనందుకు గానూ.. రెండు నెలల్లో రూ.4వేల కోట్లను చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. ఘన, ద్రవరూప వ్యర్థాల శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించటంలో విఫలమైనందుకు రూ. 4,000 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని రెండు నెలల్లోగా రింగ్ ఫెన్స్‌డ్ అకౌంట్ (ring-fenced account)లో జమ చేయాలని ఆదేశించింది. జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణులైన సభ్యులు అప్రోజ్ అహ్మద్,ఎ సెంథిల్ వేల్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వ్యర్థాల నిర్వహణ (waste management)లో బీహార్ ప్రభుత్వం అలసత్వం వహించటంపై NGT తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఘన, ద్రవరూప వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని..సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ తీర్పుల ప్రకారం ఇది చట్టాల ఉల్లంఘనే అని పేర్కొంది. ఈ అలసత్వానికి ప్రభుత్వానికి రూ. 4వేల కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధిస్తున్నామని పేర్కొంది.
(The above story first appeared on LatestLY on May 05, 2023 10:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

