Credit Card UPI Transactions: క్రెడిట్‌ కార్డు యూజర్స్‌కు గుడ్‌న్యూస్! యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు, కండీషన్స్ అప్లై అంటున్న కంపెనీలు, వారికి మాత్రమే యూపీఐ ఛార్జీలు మినహాయింపు

ముఖ్యంగా క్రెడిట్ కార్డులకు ఈ చార్జీలు ఎక్కువ. అయితే ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ చార్జీలను వసూలు చేయబోమని ఎన్పీసీఐ ప్రకటించింది. కాగా, వ్యాపారులు కస్టమర్ నుంచి ఈ ఎండీఆర్ ఛార్జీలను స్వీకరించి బ్యాంకులు చెల్లిస్తారు.

Credit Card UPI Transactions: క్రెడిట్‌ కార్డు యూజర్స్‌కు గుడ్‌న్యూస్! యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు, కండీషన్స్ అప్లై అంటున్న కంపెనీలు, వారికి మాత్రమే యూపీఐ ఛార్జీలు మినహాయింపు
state-bank-of-india-offers-emi-facility-on-its-debits-cards (Photo-File image)

New Delhi, OCT 06: క్రెడిట్ కార్డు యూజర్లకు (credit card) ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై యూపీఐ(UPI) పేమెంట్లు ఉచితంగా చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఛార్జీలు (No charges) ఉండవు. అయితే, రూ.2వేల వరకు మాత్రమే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉంది. అదీ రూపే క్రెడిట్ కార్డుల మీద మాత్రమే. ఈ మేరకు ఎన్పీసీఐ తెలిపింది. రూపే క్రెడిట్ కార్డుల (RuPay credit card) ద్వారా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు మొదలైందని.. అయితే అందులో రూ.2 వేల వరకు చేసే లావాదేవీలపై మాత్రం ఎటువంటి చార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. రిజర్డ్ బ్యాంక్ గైడ్ లైన్స్ (RBI) మేరకు.. దేశీయంగా అభివృద్ధి చేసిన పేమెంట్‌ గేట్‌ వేను ప్రోత్సాహించే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం యూపీఐ లావాదేవీలతో క్రెడిట్ కార్డులను ఆర్బీఐ అనుసంధానించనున్నట్లు తెలిపింది.

Rain Forecast in Hyderabad: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్! మరో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం, అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ ఐఎండీ హెచ్చరిక, ఎల్లో అలర్ట్ జారీ, నిన్న రాత్రి హైదరాబాద్‌ ను అతలాకుతలం చేసిన వాన 

కాగా, మన దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ కూడా రూపే ఆధారిత క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా ఈ రూపే కార్డులు (RuPay credit card ) వాడుకలో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు యూపీఐ పేమెంట్ల కోసం వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు.. సదరు దుకాణదారుల నుంచి బ్యాంకులు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) చార్జీలను వసూలు చేస్తాయి.

Shopian Encounter: జమ్మూలో ఎన్‌కౌంటర్, నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందినవారిగా గుర్తింపు 

ముఖ్యంగా క్రెడిట్ కార్డులకు ఈ చార్జీలు ఎక్కువ. అయితే ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ చార్జీలను వసూలు చేయబోమని ఎన్పీసీఐ ప్రకటించింది. కాగా, వ్యాపారులు కస్టమర్ నుంచి ఈ ఎండీఆర్ ఛార్జీలను స్వీకరించి బ్యాంకులు చెల్లిస్తారు.

(The above story first appeared on LatestLY on Oct 06, 2022 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).