Biggest Drug Bust in Delhi: ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్‌ మాఫియా గుట్టురట్టు, రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్న పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Biggest Drug Bust in Delhi: ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్‌ మాఫియా గుట్టురట్టు, రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్న పోలీసులు
Cocaine (Representative Image)

New Delhi, Oct 2: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్

అయితే, ఇటీవలే ఢిల్లీలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఆప్ఘన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, వారిద్దరినీ విచారించగా.. తాజా మాదకద్రవ్యాల బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రగ్స్‌ విషయంలో మరింత అప్రతమయ్యారు.

(The above story first appeared on LatestLY on Oct 02, 2024 03:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).