Parameswaran Iyer: నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ బాధ్యతలు స్వీకరణ, అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్‌ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు.

Parameswaran Iyer: నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ బాధ్యతలు స్వీకరణ, అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు
Parameswaran Iyer takes over as NITI Aayog's CEO (NITI Aayog/Twitter)

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్‌ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్‌ కాంత్‌ స్థానంలో అయ్యర్‌ తాజా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అయ్యర్‌ తాజా బాధ్యతల్లో కొనసాగుతారు. కాంత్‌కు వర్తించిన నియామక, బాధ్యతల విధివిధానాలే అయ్యర్‌కూ వర్తిస్తాయని అధికారిక ప్రకటన పేర్కొంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా పరిగణించిన 20 బిలియన్‌ డాలర్ల స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలుకు అయ్యర్‌ గతంలో నాయకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో పని చేశారు. 2016–20 మధ్య కాలంలో తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 12, 2022 12:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).