14 Opposition MPs Suspended: లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్, రాజ్యసభ నుంచి మరొకరు సస్పెండ్, సభలో వికృత చేష్టలకు పాల్పడినట్లు ఆరోపణలు

పార్లమెంట్‌లో నిన్న జరిగిన అలజడి తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు.

14 Opposition MPs Suspended: లోక్‌సభ నుంచి 15 మంది ఎంపీల సస్పెన్షన్, రాజ్యసభ నుంచి మరొకరు సస్పెండ్, సభలో వికృత చేష్టలకు పాల్పడినట్లు ఆరోపణలు
Lok Sabha Security Breach

New Delhi, December 14: పార్లమెంట్‌లో నిన్న జరిగిన అలజడి తర్వాత సభ నుంచి 15 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 14 మంది లోక్‌సభ నుంచి కాగా ఒకరు రాజ్య సభకు చెందినవారున్నారు. ఇందులో 9 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కాగా, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ, మరో ఇద్దరు డీఎంకే పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, ఎండీ జావేద్, వీకే శ్రీకందన్, బెన్నీ బెహనాన్, డీఎంకే ఎంపీలు కే కనిమొళి, ఎస్‌ఆర్ పార్థిబన్, సీపీఎం ఎంపీలు పీఆర్ నటరాజన్, ఎస్ వెంకటేషన్, సీపీఐ ఎంపీ కే సుబ్బరాయన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.

వీడియో ఇదిగో, లోక్‌సభ ఘటన, అగంతకులను పట్టుకుని చితక్కొట్టిన ఎంపీలు, గోరంట్ల మాధవ్ అయితే దూకి మరీ..

సభలో వికృత చేష్టలకు పాల్పడిన ఆరోపణలతో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెండయ్యారు. సస్పెన్షన్ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లడానికి ఆయన నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మోషన్ తర్వాత ఈ అంశాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి పంపారు. ఈ స్పస్పెన్షన్‌ను రాజ్యాంగేతర చర్యగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. పార్లమెంట్‌లో అలజడి బుధవారం జరగగా.. అదే రోజు ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. టిఎన్ ప్రతాపన్, హైబీ ఈడెన్, జోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియకోస్‌లను సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు.

(The above story first appeared on LatestLY on Dec 14, 2023 05:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).