UGC PhD: పీహెచ్ డీ చేసేందుకు మరో సులువైన మార్గం! నాలుగేళ్ల డిగ్రీ ఉన్నవాళ్లు ఇకపై నేరుగా పీహెచ్ డీ చేయొచ్చు
పీహెచ్‌డీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. యూజీసీ నెట్ (జూన్) సెషన్ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ (UGC) ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల పాటు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసేందుకు అర్హులని, తద్వారా వారు పీహెచ్‌డీ చేయవచ్చన్నారు.
New Delhi, April 22: పీహెచ్‌డీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం ప్రకటించింది. యూజీసీ నెట్ (జూన్) సెషన్ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ (UGC) ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. నాలుగేళ్ల పాటు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా యూజీసీ నెట్ పరీక్ష రాసేందుకు అర్హులని, తద్వారా వారు పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా, లేకపోయినా పీహెచ్‌డీ అభ్యసించేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌లు ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి 55శాతం మార్కులు ఉన్న అభ్యర్థులను మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు. తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్‌డీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ ఛైర్మన్ తెలిపారు.
TS TET: తెలంగాణ టెట్ పరీక్షకు దరఖాస్తుకు నేడే ఆఖరు.. ఇప్పటివరకూ 2,63,228 దరఖాస్తులు
ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, ఇందుకోసం వారు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుందన్నారు. యూజీసీ ఎప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల నాలుగేళ్ల డిగ్రీ పూర్తయినవారితో పాటు ప్రస్తుతం ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్ (జూన్ సెషన్)కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరోవైపు, యూజీసీ నెట్ (జూన్) సెషన్‌కు సంబంధించి శనివారం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
(The above story first appeared on LatestLY on Apr 22, 2024 12:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

