PM Modi Congratulates Mirabai Chanu: రజతం సాధించిన మీరాబాయికి ప్రధాని మోదీ అభినందనలు, ఆమె విజయం ప్రతి భారతీయుడిలో నూతనోత్సాహం నింపుతుందంటూ ట్విట్టర్లో ట్వీట్
టోక్యో బలంపిక్స్ లో భారత పతాకం రెపరెపలాడింది. 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పకం సాధించారు. ఆమె పతకం సాధించిన సాధించిన సంధర్భంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు (M Modi Congratulates Mirabai Chanu) తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత పతాకం రెపరెపలాడింది. 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పకం సాధించారు. ఆమె పతకం సాధించిన సాధించిన సంధర్భంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు (M Modi Congratulates Mirabai Chanu) తెలిపారు. ఆమె విజయం ప్రతీ భారతీయుడిలో నూతనోత్సహాం నింపుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అధ్బుతమైన ప్రదర్శన కనబరిచిన మీరాబాయి భారతదేశ కీర్తిని మరింతగా పెంచిందని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం (Mirabai Chanu Wins India's First Medal) సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో (Tokyo Olympics 2020) రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి (Mirabai Chanu) చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు.
Here's PM Tweet
Could not have asked for a happier start to @Tokyo2020! India is elated by @mirabai_chanu’s stupendous performance. Congratulations to her for winning the Silver medal in weightlifting. Her success motivates every Indian. #Cheer4India #Tokyo2020 pic.twitter.com/B6uJtDlaJo
— Narendra Modi (@narendramodi) July 24, 2021
చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్ కు బోణి కొట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 24, 2021 12:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

