అహ్మదాబాద్, జనవరి 28: గుజరాత్‌లో ఒక చిలిపి పని ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. సరదా కోసం తన బంధువు మలద్వారం లోపల కంప్రెసర్ పైపును చొప్పించడంతో బాధితుడు మరణించాడు. ప్రకాష్ వంకర్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుండి గణతంత్ర దినోత్సవం రోజున బంధువులతో కలిసి గడపడానికి మెహసానాలోని తన కజిన్స్ అల్పేష్ వంకర్, ఘేవాభాయ్ వీవర్‌ల ఇంటికి వచ్చాడు.
ప్రకాష్ తన బంధువులను కలిసేందుకు వారు పనిచేసే మెటల్ కంపెనీకి వెళ్లాడు. కంపెనీలోని కార్మికులు ఎయిర్ కంప్రెసర్‌తో పెయింట్‌ను ఆరబెడుతుండగా, అల్పేష్ వారి వద్ద నుంచి దానిని తీసుకుని, కంప్రెసర్ పైపు రబ్బరు గొట్టాన్ని ప్రకాష్ మలద్వారం లోపలికి చొప్పించాడు. దీంతో ప్రకాష్‌కు వాంతులు చేసుకోవడంతోపాటు అధిక పీడనంతో కూడిన గాలి శరీరాన్ని నింపడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనలో అల్పేష్ వంకర్‌పై కేసు నమోదైంది. పోలీసుల విచారణలో ఇదంతా సరదా కోసమే చేశానని తెలిపాడు. గత రెండు నెలలుగా కంపెనీలో పనిచేస్తున్న ఘేవాభాయ్ వీవర్, కంప్రెసర్ పైపులో అధిక పీడన గాలి ఉందని అల్పేష్‌కు తెలిసిందని, అయినప్పటికీ ఫ్రాంక్ కోసం ముందుకు సాగాడని పోలీసులకు మరో వ్యక్తి చెప్పాడు.