Gujarat Horror: గుజరాత్‌లో దారుణం, ఒకటో తరగతి పాపపై స్కూలు ప్రిన్సిపాల్ అఘాయిత్యం, చిన్నారి ప్రతిఘటించడంతో గొంతు పిసికి చంపిన కామాంధుడు
Dahod, Sep 24: గుజరాత్ లోని దహోద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాపపై ఆ స్కూలు ప్రిన్సిపాల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన వికృత చేష్టలను అడ్డుకుందనే కోపంతో గొంతుపిసికి (Principal Kills Girl) చంపేశాడు. ఆపై మృతదేహాన్ని స్కూలు ఆవరణలో పడేసి (Dumps Body In School Compound) ఏమీ తెలియనట్టు నటించాడు. పోలీసుల విచారణలో నిజం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు.
గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహోద్ జిల్లాలోని స్కూలు ప్రిన్సిపాల్ చిన్నారిని రోజూ తన కారులో స్కూలుకు తీసుకెళ్లేవాడు. పాప తల్లిదండ్రులతో పరిచయం ఉండడం, అదే స్కూలులో పాప చదువుతుండడంతో తల్లిదండ్రులు నమ్మి అతనితో పంపించేవాళ్లు. రోజూలాగే గురువారం కూడా పాపను రెడీ చేసి తల్లి ప్రిన్సిపాల్ తో పంపించింది.
ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారయత్నం, సీన్ చూసి నిందితుడిని తరిమి తరిమి కొట్టిన కోతుల గుంపు
అయితే, సాయంత్రం స్కూలు టైమ్ అయిపోయినా పాప ఇంటికి చేరకపోవడంతో ఏం జరిగిందోనని ఆందోళన పడుతూ స్కూలుకు వెళ్లిన పాప తల్లిదండ్రులకు పాప మృతదేహం కనిపించింది. స్కూలు ఆవరణలో అప్పటికే పాప మృతదేహాన్ని గుర్తించిన టీచర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. స్కూలు టీచర్లను, పాప క్లాస్ మేట్లను విచారించారు. ఆ రోజు అసలు పాప స్కూలుకే రాలేదని వారు చెప్పారు. పాప తల్లి మాత్రం రోజూ లాగే పాపను ప్రిన్సిపాల్ తో పంపించానని చెప్పింది. ప్రిన్సిపాల్ ను ప్రశ్నించగా.. పాపను స్కూలు దగ్గర దింపేసి వేరే పనిమీద వెళ్లిపోయానని చెప్పాడు.
Here's NDTV News
Principal Kills Girl, 6, For Resisting Rape, Dumps Body In School Compoundhttps://t.co/cX39BdHzXp pic.twitter.com/OD0ADnhwrs
— NDTV (@ndtv) September 24, 2024
అయితే, ప్రిన్సిపాల్ తీరు అనుమానాస్పదంగా కనిపించడం, పాపను చివరిసారిగా చూసింది అతడొక్కడే కావడంతో పోలీసులు అనుమానించి గట్టిగా విచారించారు. దీంతో పాపను తానే హత్య చేసినట్లు ప్రిన్సిపాల్ ఒప్పుకున్నాడు. కారులో స్కూలుకు వస్తుండగా మధ్యలో లైంగికంగా వేధించానని, తన చేష్టలకు పాప అరవడంతో గొంతు పిసికి చంపేశానని చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు.
(The above story first appeared on LatestLY on Sep 24, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

