Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ
వయనాడ్ లో లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఉదయం 9.20 నిమిషాల సమయానికి అందిన సమాచారం ప్రకారం 24 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు.
Wayanad, Nov 23: వయనాడ్ లో (Wayanad) లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఉదయం 9.20 నిమిషాల సమయానికి అందిన సమాచారం ప్రకారం 46 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ఉన్నారు. అటు వయనాడ్ లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తొలుత ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చినా ఆ తర్వాత వెనుకపడ్డట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తున్నది.
LIVE Video:
హోరాహోరీ పోటీ
మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది జార్ఖండ్ లోని బర్హత్ లో హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. కొలబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్.. కొప్రిలో ఏక్ నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 23, 2024 09:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

