Pushpa Actor Shri Tej: పుష్ప నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి

పుష్ప నటుడు శ్రీతేజ్‌ (Sritej)పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్‌ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Pushpa Actor Shri Tej: పుష్ప నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి
Pushpa actor Shri Tej faces charges of cheating under pretense of marriage; police case registered in Kukatpally Police Station

పుష్ప నటుడు శ్రీతేజ్‌ (Sritej)పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్‌ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదు..కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదు

శ్రీతేజ్‌పై గతంలో కూడా ఇదే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీతేజ్‌ పెళ్లైయిన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అక్రమ సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో అప్పట్లో బ్యాంక్ ఉద్యోగి సురేశ్‌ మృతి చెందినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బ్యాంక్‌ ఉద్యోగి మృతితో గతంలో మాదాపూర్‌ పీఎస్‌లో ఇతనిపై కేసు నమోదైంది. వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, పుష్ప ది రైజ్‌, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‌ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

(The above story first appeared on LatestLY on Nov 27, 2024 01:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).