Railways Ticket Checking Drive: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్లో ప్రయాణించే ముందు ఈ ఒరిజినల్ ఐడీ తప్పక ఉండాలి.. భారతీయ రైల్వే కీలక సూచన..
సెంట్రల్ రైల్వే పరిధిలోని లోకల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, స్టేషన్లలో అక్టోబర్ 1 నుండి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ తనిఖీలు అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి.
Railways Ticket Checking Drive: సెంట్రల్ రైల్వే పరిధిలోని లోకల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, స్టేషన్లలో అక్టోబర్ 1 నుండి ఒక నెల రోజుల పాటు ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ తనిఖీలు అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి. కేవలం టికెట్ లేని ప్రయాణికులను పట్టుకోవడమే కాకుండా, రాయితీ ఛార్జీలు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌లపై ప్రయాణించే ప్రయాణికుల అర్హతను, ప్రామాణికతను ధృవీకరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
రాయితీ టిక్కెట్లు లేదా వివిధ కోటాల కింద ప్రయాణించేవారు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ఆమోదించబడిన అసలు (Original) గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్ లేదా విద్యార్థి గుర్తింపు కార్డులను ధృవీకరణ కోసం అనుమతిస్తారు. మొబైల్‌లోని ఫోటోలు లేదా జెరాక్స్ ప్రతులను చెల్లుబాటు అయ్యే ఆధారాలుగా పరిగణించరని రైల్వే స్పష్టం చేసింది.
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జీతం, PF, బ్యాంకింగ్‌పై కీలక మార్పులు..
గ్రూప్ బుకింగ్‌ల విషయానికొస్తే.. ఒకే టిక్కెట్‌పై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నట్లయితే, ఆ టిక్కెట్‌పై పేరున్న వారిలో కనీసం ఒక్కరైనా తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో టికెట్ ఉన్నప్పటికీ, సదరు ప్రయాణికులను టికెట్ లేని వారిగానే పరిగణిస్తారు. అలాగే ఈ-పాస్ లేదా పిటిఓ (PTO) ద్వారా ప్రయాణించే రైల్వే సిబ్బంది కూడా ప్రయాణానికి ముందే వాటిని నిబంధనల ప్రకారం మార్చుకుని, తగిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
సవరించిన జన్ విశ్వాస్ చట్టం నిబంధనల ప్రకారం, టిక్కెట్టు లేకుండా లేదా అనధికారికంగా ప్రయాణించే వారికి విధించే కనీస అదనపు ఛార్జీని రూ. 250 నుండి రూ. 500కి పెంచినందున, ప్రయాణికులు తగిన ఆధారాలతో ప్రయాణించి జరిమానాల భారం నుండి తప్పించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. టికెట్ తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రయాణికుల వివరాలను తక్షణమే సరిచూసేందుకు 'TTE యాప్'ను ఉపయోగిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 30, 2026 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

