Rajasthan Shocker: ఇన్సురెన్స్ డబ్బుల కోసం భార్యను చంపాడు, ఆమెకు వారం క్రితమే ఇన్సురెన్స్ చేయించిన భర్త, యాక్సిడెంట్‌లో చనిపోతేనే ఎక్కువ డబ్బులు వస్తాయని పక్కా స్కెచ్‌తో హత్య

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే షాలూను.. మహేశ్‌ చంద్‌ హత్య చేయించాడని, ఇన్సూరెన్స్‌ డబ్బు కోసమే ఇదంతా చేశాడని తేలింది. కొన్ని రోజుల క్రితం మహేశ్‌ తన భార్య షాలూ పేరుపై ఇన్సూరెన్స్‌ (Insurance) చేశాడు. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్‌లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 ఏండ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడు.

Rajasthan Shocker: ఇన్సురెన్స్ డబ్బుల కోసం భార్యను చంపాడు, ఆమెకు వారం క్రితమే ఇన్సురెన్స్ చేయించిన భర్త, యాక్సిడెంట్‌లో చనిపోతేనే ఎక్కువ డబ్బులు వస్తాయని పక్కా స్కెచ్‌తో హత్య
Representational Image (Photo Credits: Pixabay)

Jaipur, DEC 01: రాజస్థాన్‌లో దారుణం (Rajasthan) చోటుచేసుకున్నది. ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం కట్టుకున్న భార్యను చంపాడో (Kills Wife) ఘనుడు. జైపూర్‌కు చెందిన షాలూ (Shalu) , మహేశ్‌ చంద్‌ (Mahesh Chand) భార్యా భర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉన్నది. దంపతుల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో షాలూ.. గత కొంతకాలంగా తన పుట్టింట్లో ఉంటున్నది. అయితే తాను ఓ జ్యోతిష్యుడిని కలిశానని, ఇద్దరం కలిసి జీవించాలంటే 11 వారాలపాటు తెల్లవారుజామున హనుమాన్‌ ఆలయానికి వెళ్లాలని తన భార్యను నమ్మించాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాడు. పూజలు పూర్తయిన తర్వాత తనతో ఇంటికి తీసుకెళ్తానన్నాడు. భర్త మాటలు నమ్మిన షాలూ.. తన సోదరుడితో కలిసి ఉదయం 4.30 సమయంలో ఆలయానికి వెళ్తున్నది. ఈ క్రమంలో ఒకరోజు షాలూ వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది (Accident). దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె సోదరుడు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో వారు చనిపోయారని అంతా నమ్మారు.

Bengaluru: చదివేది 8 వ తరగతి, బ్యాగ్ నిండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, బెంగుళూరు స్కూల్ తనిఖీల్లో విస్తుపోయిన అధికారులు 

అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే షాలూను.. మహేశ్‌ చంద్‌ హత్య చేయించాడని, ఇన్సూరెన్స్‌ డబ్బు కోసమే ఇదంతా చేశాడని తేలింది. కొన్ని రోజుల క్రితం మహేశ్‌ తన భార్య షాలూ పేరుపై ఇన్సూరెన్స్‌ (Insurance) చేశాడు. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్‌లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 ఏండ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడు.

Bihar Shocker: బీహార్‌లో దారుణం, 70 ఏళ్ల వృద్ధుడిని సెక్స్ కోసం రూంలోకి రమ్మంది, తన నలుగురు ప్రియులతో కలిసి దారుణంగా చంపేసింది, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 

ఈనేపథ్యంలో రౌడీ షీటర్‌ ముఖేశ్‌ సింగ్‌తో (Mukesh Singh) కలిసి ఆమె హత్యకు ప్లాన్‌ చేశాడు. యాక్సిడెంట్‌లో ఆమె చనిపోతే పూర్తి మొత్తం వస్తుండటంతో.. ఆమెను తెల్లవారుజామున దేవాలయానికి వెళ్లాలని నమ్మించాడు. ముందస్తు ప్రణాళిక మేరకు ఆమె ఆలయానికి వెళ్తుండగా కారుతో గుద్ది చంపేశారని డీసీపీ వందితా రాణా తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Dec 01, 2022 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).