Bihar Shocker: బీహార్‌లో దారుణం, 70 ఏళ్ల వృద్ధుడిని సెక్స్ కోసం రూంలోకి రమ్మంది, తన నలుగురు ప్రియులతో కలిసి దారుణంగా చంపేసింది, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Representational Image | (Photo Credits: IANS)

Patna, Nov 30: బీహార్‌లోని నలందాలో దారుణం చోటు చేసుకుంది. 75 ఏళ్ల వృద్ధుడిని అతని ప్రియురాలు హత్యచేసి (Woman among five held for killing her paramour)మరుగుదొడ్డి ట్యాంక్‌లో పడేసింది. ఈ దారుణానికి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో నలుగురు సహకరించారు. అక్టోబరు 18న జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిను దేవీ(30) అనే వితంతువు నలందలోని అస్తవాన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలొ టీ దుకాణం నిర్వహిస్తుండేది.

అక్కడుకు కృష్ణనందన్‌ ప్రసాద్‌ (75), సూర్యమణి కుమార్‌ (60), వాసుదేవ్‌ పాశ్వాన్‌ (63), లోహా సింగ్‌ (62) అనే వ్యక్తులు టీ కోసం వచ్చేవారు. ఈ నలుగురు.. పిను దేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నాళ్ల తర్వాత త్రిపిత్ శర్మ (75) అనే వృద్ధుడు అదే టీ దుకాణానికి వచ్చి పిను దేవితో సన్నిహితంగా ఉండేవాడు. అలా వీరిమధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది.

నాకు చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉంది, శ్రద్ధాను ముక్కలుగా నరికినందుకు నేనేమి బాధపడట్లేదు, పాలిగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితుడు

త్రిపిత్ శర్మతో సంబంధం తెంచుకోవాల్సిందిగా ఆ నలుగురూ ఆమెను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో త్రిపిత్ శర్మతో పినుదేవీకి గొడవలు వచ్చాయి. దాంతో హత్య చేసేందుకు పిను దేవి.. తన నలుగురు ప్రియులతో కలిసి ప్రణాళిక రూపొందించుకుంది. ఇంటికి రమ్మని అతనిని పిలిచింది. పథకం ప్రకారం తన నలుగురు ప్రియులు రాళ్లతో అతనిపై దాడి చేసి (killing her paramour) హతమార్చారు. మృతదేహాన్ని మరుగుదొడ్డి ట్యాంక్‌లో పడేశారు.

త్రిపిత్ కుమారుడు మిథు కుమార్ తన తండ్రిని హత్య చేసి ఉండవచ్చని భావించి అక్టోబర్ 21న నలందలోని అస్తవాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇంటి నీటి ట్యాంక్ లో కనుగొన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలో ఈ సారి కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికేసింది, కుమారుడితో కలిసి భర్తను చంపి ఆ శవాన్ని ముక్కలుగా నరికిన భార్య, అర్థరాత్రి ఆ ముక్కలను వివిధ ప్రదేశాల్లో పడేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్, ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

డీఎస్పీ డాక్టర్ షిబ్లి నోమాని మాట్లాడుతూ.. పినూ దేవి (30)కి మృతుడితో సహా కనీసం ఐదుగురితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. మృతుడితో ఆమెకు కొన్ని విభేదాలు ఏర్పడి తన ఇతర పారామోర్స్‌తో కలిసి అతడిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇటుకలతో మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లోకి నెట్టారు.ఈ కేసులో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించారు.నిందితులను కృష్ణానందన్ ప్రసాద్ (75), సూర్యమణి కుమార్ (60), వాసుదేవ్ పాశ్వాన్ (63), బనారస్ ప్రసాద్ అలియాస్ లోహాగా గుర్తించామని తెలిపారు. మరణించిన వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పిను దేవి నుండి స్వాధీనం చేసుకున్నారు.