Delhi Horror: ఢిల్లీలో ఈ సారి కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికేసింది, కుమారుడితో కలిసి భర్తను చంపి ఆ శవాన్ని ముక్కలుగా నరికిన భార్య, అర్థరాత్రి ఆ ముక్కలను వివిధ ప్రదేశాల్లో పడేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్, ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య (Man Kills Father With Mother’s Assistance) చేసింది ఓ కసాయి భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది.
New Delhi, Nov 28: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య (Man Kills Father With Mother’s Assistance) చేసింది ఓ కసాయి భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్‌లో (Cuts Body Into Bits and Stores Pieces) పడేసింది. పాండవ్ నగర్‌లోని త్రిలోక్ పురిలో (Trilokpuri Murder) ఈ దారుణం జరిగింది. తల్లి, కుమారుడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.కుమారుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్‌లోని గ్రౌండ్‌తో పాటు, తూర్పు ఢిల్లీలో ఓ చోట పడేసినట్లు వెల్లడించారు. మొదట తూర్పు ఢిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. చాంద్ సినిమా ఎదుట అర్ధరాత్రి సీసీ టీవీ పుటేజి ఈ మహిళ వెళుతున్నట్లుగా దృశ్యాలు కనిపించాయి.
వీడియో ఇదే..
ఇలాంటి దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) సీతాపూర్‌లో కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది.(UP Man Kills Wife) ఈ కేసులో మహిళ మృతదేహాన్ని హంతకులు ముక్కలుగా నరికి సుదూరప్రాంతంలో పడేశారు.(Chops Body Into Pieces)ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని రాంపూర్ కలాన్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ మృతదేహాన్ని నవంబర్ 8వతేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు పంకజ్ మౌర్య,దుర్జన్ పాసిని అరెస్టు చేశారు.
హత్యకు గురైన మహిళ నిందితుల్లో ఒకరైన పంకజ్ మౌర్య భార్య.రాంపూర్ కలాన్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు పంకజ్ మౌర్య తన సహచరులలో ఒకరితో కలిసి తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ నిత్యం డ్రగ్స్ తీసుకునేదని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.పంకజ్ మౌర్య అనే నిందితుడు తనకు వివాహమై పదేళ్లకు పైగా అయినా జ్యోతి తనను మోసం చేస్తుందనే అనుమానంతో ఆమెను అంతమొందించాలని భర్త పంకజ్ నిర్ణయించుకున్నట్లు సీతాపూర్ పోలీసులు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Nov 28, 2022 08:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

