Bengaluru, Nov 26: ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల పనిమనిషితో (Maid) వివాహేతర సంబంధం (Illegal affair) పెట్టుకున్నాడు ఓ 67 ఏళ్ల వ్యాపారి (Businessman). ఇటీవల ఆమెతో శృంగారం (Sex) చేస్తుండగా.. గుండెపోటుకు (Heart Stroke) గురయ్యి.. బెడ్‌పైనే (Bed) మృతి చెందాడు. దీంతో సదరు మహిళ హడలిపోయింది. యజమాని చనిపోవడంతో హత్య కేసు తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడింది. దీంతో భర్త, సోదరుడిని పిలిపించింది. అందరూ కలిసి ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో వ్యాపారి మృతదేహాన్ని చుట్టేసి ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో పడేశారు. బెంగళూరులోని జేపీ నగర్ పుట్టెనహళ్లి ప్రాంతంలో జరిగిందీ ఘటన.
మృతదేహానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది హత్య కాదన్న నిర్ధారణకొచ్చారు. బాధితుడిని వ్యాపారి బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పనిమనిషిని కూడా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.