Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..  మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి
Representational (Credits: Facebook)

Hyderabad, Nov 26: శబరిమల (Sabarimala) భక్తులకు (Devotees) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Good News) చెప్పింది. భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు (Special Trains) అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నట్టు వెల్లడించింది.

తెలంగాణలో పెద్దమొత్తంలో గ్రూప్-4 జాబ్స్‌ భర్తీకి అనుమతి, మొత్తం 9,168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మూడు కేటగిరీల్లో కొలువులు, ఏయే విభాగాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి!

రైళ్ల రాకపోకలు ఇలా..

* హైదరాబాద్-కొల్లాం: డిసెంబరు 5, 12, 19, 26, మళ్లీ జనవరి 2, 9, 16

* కొల్లాం-హైదరాబాద్ : డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17

* నర్సాపూర్-కొట్టాయం: డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13

* కొట్టాయం-నర్సాపూర్ : డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14

* సికింద్రాబాద్-కొట్టాయం: డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8

* కొట్టాయం-సికింద్రాబాద్ : డిసెంబరు 4, 11, 18, 25, మళ్లీ జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరుతాయి.