Group-IV Jobs in Telanagana: తెలంగాణలో పెద్దమొత్తంలో గ్రూప్-4 జాబ్స్‌ భర్తీకి అనుమతి, మొత్తం 9,168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మూడు కేటగిరీల్లో కొలువులు, ఏయే విభాగాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి.

Group-IV Jobs in Telanagana: తెలంగాణలో పెద్దమొత్తంలో గ్రూప్-4 జాబ్స్‌ భర్తీకి అనుమతి, మొత్తం 9,168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, మూడు కేటగిరీల్లో కొలువులు, ఏయే విభాగాల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి!
TSPSC notifies 1,392 junior lecturer posts

Hyderabad, NOV 25: తెలంగాణలో మరోసారి కొలువుల జాతరొచ్చింది. ఒకేసారి 9వేలకు పైగా గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి (Group-IV vacancies)  రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి (Jobs) ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు (Harish rao) తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ద్వారా రూ.9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆశావహులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి.

ఇందులో ఎక్కువగా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల 

ఇంతకు ముందు ప్రభుత్వం గ్రూప్-2లో 663 పోస్టులు గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరికొన్ని కేటగిరీ పోస్టులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోస్టులు ఉండటంతో ఈ సారి భారీగానే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

(The above story first appeared on LatestLY on Nov 25, 2022 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).