Rajasthan Shocker: రాజస్థాన్‌లో దారుణం, రోజుల తరబడి మత్తుమందు ఇచ్చి మహిళపై ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్, ఘటనను వీడియో తీసి బ్లాక్‌మెయిల్
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత కుటుంబం ఇంట్లోకి చొరబడిన కామాంధుడు ఆ ఇంటి మహిళ రూంలో నిద్రిస్తుండగా గ్యాంగ్ రేప్ కు (Dalit woman gang-raped) పాల్పడ్డాడు.
Ajmer, Oct 10: రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత కుటుంబం ఇంట్లోకి చొరబడిన కామాంధుడు ఆ ఇంటి మహిళ రూంలో నిద్రిస్తుండగా గ్యాంగ్ రేప్ కు (Dalit woman gang-raped) పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి మరి కొందరితో కలిసి ఈ కామాంధులు రోజుల తరబడి (held captive for days ) గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ శర్మ లైంగికదాడికి పాల్పడి (Dalit woman gang-raped in Ajmer) ఆ దృశ్యాన్ని వీడియో తీశాడని, ఆ తర్వాత బాధితురాలిని బెదిరించి డబ్బు వసూలు చేయడంతోపాటు మరికొందరితో కలిసి రోజుల తరబడి అత్యాచారం జరిపాడని అజ్మీర్ నార్త్ డీఎస్పీ చావీ శర్మ ఆదివారం వెల్లడించారు. బాధితురాలికి నిందితులు మత్తు మందు ఇవ్వడంతో తనపై అత్యాచారానికి పాల్పడినవారు ఎందరో ఆమె చెప్పలేకపోతున్నదని వెల్లడించారు.
ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే బాధితురాలి పిల్లలతోపాటు భర్తను చంపేస్తామని నిందితులు ఆమెను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, దీంతో నిందితులు గత నెల 27న ఆమెను పోలీస్ స్టేషన్ వెలుపల వదిలేసి వెళ్లారని వివరించారు. దాదాపు నెల రోజుల నుంచి తనను నిర్బంధించి అనేకమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
(The above story first appeared on LatestLY on Oct 10, 2022 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

