Rajasthan Shocker: ఘోర విషాదం, సోదరి చితిమంటల్లో దూకిన అన్న, 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువకుడు

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ చితి మంటల్లోకి దూకేశాడు. భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో గురువారం 25 ఏళ్ల యువకుడు సుఖ్ దేవ్ భిల్.. కజిన్ సిస్టర్ చితిమంటల్లోకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు.

Rajasthan Shocker: ఘోర విషాదం, సోదరి చితిమంటల్లో దూకిన అన్న, 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చావు బతుకుల్లో యువకుడు
presentational Image (File Photo)

Jaipur, June 2: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన కజిన్ సిస్టర్ చితి మంటల్లోకి దూకేశాడు. భివారా జిల్లాలోని మణక్యా గ్రామంలో గురువారం 25 ఏళ్ల యువకుడు సుఖ్ దేవ్ భిల్.. కజిన్ సిస్టర్ చితిమంటల్లోకి దూకి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతను ఆసుపత్రిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతను మంటల్లోకి దూకగానే బంధువులు, ఇతర గ్రామస్తులు అతనిని బయటకు తీసి, ఆసుపత్రిలో చేర్పించారు.

11 ఏళ్ళ బాలిక జీవితాన్ని చిదిమేసిన ఫేస్‌బుక్ మోజు, రెండేళ్లపాటు బంధించి దారుణంగా అత్యాచారం చేసిన స్నేహితుడు

అతని ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. అతని అడుగు వెనుక ఉన్న కారణం ఇంకా నిర్ధారించబడలేదు. భివారా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంచల్ మిశ్రా ఈ ఘటనపై మాట్లాడారు. సుఖ్ దేవ్ భిల్ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వర్గాలు తమకు సమాచారం అందించాయని చెప్పారు. 95 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న యువకుడు స్టేట్‌మెంట్ ఇచ్చే స్థితిలో లేడని మిశ్రా తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jun 02, 2023 11:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).