Rajasthan Shocker: రక్షణ ఎక్కడ.. మహిళ జుట్టు కత్తిరించి, హింసిస్తూ.. ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం, మరో చోట బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్
Image used for representational purpose | (Photo Credits: File Image)

Jaipur, Oct 22: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే దర్శనమిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళ్లితే.....రాజస్తాన్‌లోని నాగౌర్‌ జిల్లాకి చెందిన 35 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కిడ్నాప్‌ చేసి సాముహిక అత్యాచారానికి (Three miscreants gang-rape woman) పాల్పడ్డారు.

ఈ భయంకరమైన ఘటన ఆమె షాపింగ్‌ చేసుకుని తన బిడ్డతో​ కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు​ చోటుచేసుకుంది.. ఈ మేరకు ఆ మహిళ పై సాముహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆమెను అత్యంత దారుణంగా కొట్టి, జుట్టు (victim thrashed and her hair chopped) కత్తిరించారు. పైగా ఆ నిందుతులు ఆమెను 6 గంటలు బంధించి ఉంచారు.

ఈ మేరకు పోలీసులు బాధితురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నాగౌర్ సీఐ వినోద్ సీపా మాట్లాడతుతూ..." సంఘటనా స్థలానికి చేరుకుని ఒక నిందుతుడిని అదుపులోకి తీసుకున్నమని మిగతా ఇద్దరూ ఆచూకి కోసం గాలిస్తున్నాం. బాధిత మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం జెఎల్‌ఎన్ ఆసుపత్రికి తరలించాం" అని చెప్పారు.

దారుణం..పోర్న్ వీడియోలు చూడలేదని బాలికను కిరాతకంగా చంపేసిన ముగ్గురు బాలలు, ఆన్‌లైన్ క్లాసుల కోసం తండ్రి కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని వందల సెక్స్ వీడియోలు, చిత్రాలు

ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల బాలిక‌ను అప‌హ‌రించి సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన న‌లుగురు నిందితుల‌ను పోలీసులు గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో అరెస్ట్ చేసి బాధితురాలిని కాపాడారు. సెప్టెంబ‌ర్ 28న బాలిక ఇంటి నుంచి అదృశ్యం కాగా అక్టోబ‌ర్ 15న రాజ్‌కోట్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు ఆమెను నిందితుల చెర నుంచి విడిపించారు. న‌లుగురు నిందితుల‌ను భురా జాద‌వ్‌, ల‌క్‌ప‌తి జాద‌వ్‌, వినోద్ కుష్వాహ, స‌మీర్ కుష్వాహ‌గా గుర్తించారు. వీరంతా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా ప్రాంతానికి చెందిన వారేన‌ని వెల్ల‌డైంది.

కళ్లముందే భార్య వేరొకరితో, ఇదేంటని అడిగితే చంపేస్తానని బెదిరింపులు, మన‌స్తాపంతో భర్త ఆత్మహత్య, నా చావుకు భార్య‌, ఆమె ప్రియుడే కారణమని సూసైడ్ నోట్‌

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 28న బాలిక అదృశ్యం కాగా ఆమె మొబైల్ ఫోన్ కాంటాక్ట్ మొబైల్ సిగ్న‌ల్స్ ఆధారంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని శివ‌పురి నుంచి గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు 48 గంటల్లో మారిన‌ట్టు గుర్తించారు. బాలిక‌ను శివ‌పురి తీసుకువెళ్లిన త‌ర్వాత ఇద్ద‌రు వ్య‌క్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఆపై బాధితురాలిని న‌లుగురు నిందితులు రాజ్‌కోట్‌కు తీసుకువెళ్లారు.

కిడ్నాప‌ర్ల‌లో ఒక‌రు బాలిక ప్రియుడ‌ని, వీరిద్ద‌రూ గ‌తంలో ప‌లుసార్లు కలుసుకున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. త‌న‌తో స‌న్నిహితంగా మెల‌గాల‌ని ప్రియుడు ఒత్తిడి తీసుకువ‌స్తుండ‌టంతో బాలిక అత‌డిని దూరం పెట్టింది. సెప్టెంబ‌ర్ 28న బ‌య‌ట క‌లుద్దామ‌ని బాలిక‌ను మ‌భ్య‌పెట్టిన నిందితుడు ఆమె ఇంటి నుంచి రాగానే కిడ్నాప్ చేసి శివ‌పురికి తీసుకువ‌చ్చాడు. నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.