Mr Bachchan Trailer: మళ్లీ రిపీట్ అవుతున్న మిరపకాయ్ కాంబినేషన్, ఆగస్ట్ 15న రచ్చ లేపనున్న మిస్టర్ బచ్చన్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Hyderabad, AUG 07: అగ్ర కథానాయకుడు రవితేజ (Raviteja), దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో (Harish Shankar) వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.
విడుదలకు ఇంకా 08 రోజులే ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో రవితేజ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మిరపకాయ్ సినిమా తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Aug 07, 2024 08:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

