Relation Tips: నా భర్త పోర్న్ వీడియోలు చూస్తూ నన్ను కూడా చూడమని బలవంతం చేస్తున్నాడు, నాకు అవి ఇష్టం లేదని ఆయనతో చెప్పలేకపోతున్నా, దయచేసి సమస్యకు పరిష్కారం చెప్పండి
హాయ్ నా పేరు సుమమతి (పేరు మార్చాం) నా సమస్య గురించి చెప్పే ముందు నేను చాలాసార్లు ఆలోచించా. కానీ, ఎంతకీ సమాధానం రాక ఈ సమస్యని మీ ముందు పెడుతున్నా. నా భర్తకి అశ్లీల వీడియోలు అంటే చాలా ఇష్టం. మేము శృంగారం చేసే ముందు ప్రతి రోజూ వాటిని చూస్తాడు.
ప్రశ్న: హాయ్ నా పేరు సుమమతి (పేరు మార్చాం) నా సమస్య గురించి చెప్పే ముందు నేను చాలాసార్లు ఆలోచించా. కానీ, ఎంతకీ సమాధానం రాక ఈ సమస్యని మీ ముందు పెడుతున్నా. నా భర్తకి అశ్లీల వీడియోలు అంటే చాలా ఇష్టం. మేము శృంగారం చేసే ముందు ప్రతి రోజూ వాటిని చూస్తాడు. అంతటితో ఆగకుండా నన్ను కూడా ఆ వీడియోలు చూడమని ఫోర్స్ చేస్తున్నాడు. నాకు ఆ వీడియోలు చూడటం చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఆ వీడియోలు నాకు నచ్చవు కూడా. కానీ, ఈ విషయాన్ని మా ఆయనకి చెప్పలేకపోతున్నా..దయచేసి నేను ఏం చేయాలి.
జవాబు: మీ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మీ భర్తతో ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం కష్టంగానే ఉంటుంది.ఏమి చెబితే తాను ఎలా తీసుకుంటాడోనన్న భయం కూడా ఉంటుంది.మీరు ముందుగా తనకి ఆ వీడియోలు అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకోవాలి. తాను అశ్లీల వీడియోలకి ఎందుకంత అట్రాక్ట్ అయ్యాడో తెలుసుకుంటే మీ సమస్యల చాలా త్వరగా పరిష్కారం అవుతుంది.
ముందుగా మిమ్మల్ని మీరు అతనికి ఎలా నచ్చుతారో అలా మల్చుకోవాలి. అతనికి ఏ భంగిమలు ఇష్టమో తెలుసుకుని వాటికి మీరు రెడీ అవ్వాల్సి ఉంటుంది. అలాగే చెప్పే విధానంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. నాకు ఆ వీడియోలు చూడడం కంటే మీతో నేరుగా చేయడమే బాగుంటుంది అనే విధంగా మోటివేట్ చేయాలి. తన ఇష్టాలను గౌరవిస్తూనే మీకు ఇష్టం లేదని చెప్పండి. దాని బదులు రొమాంటిక్ మూవీ, ఫొటోలు వంటివి చూద్దామని చెప్పండి. వాటివల్ల ఇంకా మూడ్ పెరుగుతుందని చెప్పండి. అప్పటికీ సమస్యకు పరిష్కారం రాకుంటే ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడడం చేయండి. దీని వల్ల ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
(The above story first appeared on LatestLY on Apr 28, 2023 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

