Saturn Transit 2022: 5 రోజుల్లో కుంభ రాశి నుంచి మకరరాశిలోకి శని గ్రహం, ఈ ఆరు రాశుల వారిపై తీవ్ర ప్రభావం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి

మరో 5 రోజుల్లో అంటే జూలై 12న శని గ్రహం తన రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్న శని..5 రోజుల తర్వాత మకరరాశిలోకి (Saturn transit in Capricron 2022) ప్రవేశించనుంది. దీని ప్రభావం ప్రధానంగా 6 రాశులపై ఉండనుంది.

Saturn Transit 2022: 5 రోజుల్లో కుంభ రాశి నుంచి మకరరాశిలోకి శని గ్రహం, ఈ ఆరు రాశుల వారిపై తీవ్ర ప్రభావం, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి
(Photo Credits: Flickr)

మరో 5 రోజుల్లో అంటే జూలై 12న శని గ్రహం తన రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమనంలో ఉన్న శని..5 రోజుల తర్వాత మకరరాశిలోకి (Saturn transit in Capricron 2022) ప్రవేశించనుంది. దీని ప్రభావం ప్రధానంగా 6 రాశులపై ఉండనుంది. ఈ ప్రభావం 3 రాశులవారికి అనుకూలంగా, మరో మూడు రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. శని సంచారం (Saturn transit 2022) వల్ల ఏ రాశులవారికి ( Zodiac signs) లాభం, ఏ రాశులవారికి నష్టం.. పండితులు ఏమి చెబుతున్నరో ఓ సారి తెలుసుకుందాం.

కుంభ రాశి నుంచి మకరరాశిలో తిరోగమన శని ప్రవేశంతో మీన రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. వీరికి అన్నిరకాలుగా డబ్బు , ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందవచ్చు. అలాగే ఇది పెట్టుబడికి మంచి సమయం.

మకరరాశిలో తిరోగమన శని సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయంగా పండితులు చెబుతున్నారు.

30 ఏళ్ల తర్వాత శని ప్రభావంతో ఈ మూడు రాశులకు మహారాజయోగం, పట్టిందల్లా బంగారమే, అన్ని రంగాల్లోనూ విజయమే, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి

మకరరాశిలో శని సంచారం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. వృత్తి-వ్యాపారాలలో లాభంతో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారస్థులకు భారీగా లాభాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది.

తిరోగమన శని మకరరాశిలో ప్రవేశించడం మిథునరాశి వారికి ఇబ్బందులు కలిగిస్తుంది. వారు డబ్బును పొందుతారు కాని పెరిగిన ఖర్చులు వారిని పొదుపు చేయనివ్వవు. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు.

శని సంచారం తుల రాశి వారికి కష్టాలను ఇస్తుంది. వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. పరీక్షలకు హాజరయ్యే వారు, ఇంటర్వ్యూకు వెళ్లేవారు చాలా కష్టపడాల్సి వస్తుంది.

మకరరాశిలోకి శని ప్రవేశం వల్ల కుంభరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరితోనూ వాదించకండి, లేకుంటే అనవసరంగా దూరమవుతారు. బడ్జెట్ చూసి ఖర్చు పెట్టడం మంచిది.

(The above story first appeared on LatestLY on Jul 07, 2022 07:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).