SC on Hijab: కాలేజీల్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, అమ్మాయిలకు దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తెలిపిన ధర్మాసనం
క్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.
Mumbai, August 9: క్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు అనుమతించింది. ఈ కేసుపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీం స్టే విధించింది. కళాశాల యాజమాన్యం తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు వారు ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. కాలేజీలు వారిని బలవంతం చేయకూడదు. దేశంలో అనేక మతాలు ఉన్నాయి. విద్యార్థుల పేర్లతో వారి మతపరమైన గుర్తింపు బయటపడట్లేదా? అని ప్రశ్నించింది. అమ్మాయిలకు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది. కాగా క్యాంపస్‌లో హిజాబ్ (Hijab), బుర్కా, నిఖాబ్, క్యాప్ వంటివి ధరించకూడదంటూ ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ (Mumbai College) ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. ముంబై కాలేజీలో హిజాబ్ నిషేధం, ఎలాంటి జోక్యం చేసుకోలేమని తెలిపిన బాంబే హైకోర్టు
దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. కళాళాల నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. నిషేధంపై స్టే విధించింది. అయితే, తరగతి గదుల్లో ముఖం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను అనుమతించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
క్యాంపస్‌లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని తెలిపింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే.. సదరు విద్యా సంస్థ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పించింది. అనంతరం దీనిపై కాలేజీకి నోటీసులు జారీ చేసింది. నవంబరు 18లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
(The above story first appeared on LatestLY on Aug 09, 2024 10:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

