Surat Hotel Tragedy: హోటల్‌లో చెక్-ఇన్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. సీన్ చూసి షాక్‌లోకి వెళ్లిన ప్రియురాలు.. సీసీటీవీ వీడియో వైరల్
హోటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తూ చెక్-ఇన్ చేసుకుంటున్న ఒక యువకుడు క్షణాల వ్యవధిలోనే నేలపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికర ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఊహించని ఈ హఠాత్ పరిణామం అక్కడున్న వారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Surat Hotel Tragedy: హోటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తూ చెక్-ఇన్ చేసుకుంటున్న ఒక యువకుడు క్షణాల వ్యవధిలోనే నేలపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికర ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఊహించని ఈ హఠాత్ పరిణామం అక్కడున్న వారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని భీస్తాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ పవార్ అనే యువకుడు తన స్నేహితురాలితో కలిసి దిండోలిలోని 'ఆర్‌జేడీ ప్లాజా' హోటల్‌కు వచ్చాడు. రూమ్ పొందడానికి రిసెప్షన్ కౌంటర్ వద్ద నిలబడి తన గుర్తింపు కార్డును సిబ్బందికి అందిస్తూ మాట్లాడుతున్నాడు. అంతలోనే అతడి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి, ఒక్కసారిగా కౌంటర్ పక్కనే నేలపై పడిపోయాడు.
కిందపడిన తక్షణమే అతడి శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో పక్కనే ఉన్న స్నేహితురాలు, హోటల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు వెంటనే పరుగెత్తుకొచ్చి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ దారుణ ఘటన మొత్తం హోటల్ రిసెప్షన్‌లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. సమాచారం అందుకున్న దిండోలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Man Collapses and Dies While Checking In at Reception
🚨 SURAT, GUJARAT | MAN COLLAPSES AT HOTEL RECEPTION
A man suddenly collapsed while speaking at the reception of a hotel in Surat, Gujarat.
He was rushed for medical treatment but was later declared dead. The incident was captured on CCTV while the exact cause of death is yet… pic.twitter.com/VOMUKsovlu
— contentkikamii (@contentkikamii) August 17, 2026
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రమాదవశాత్తు మరణంగా (Accidental Death) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆకాష్ మృతికి సైలెంట్ హార్ట్ ఎటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు మరణ కారణం వెల్లడికానుంది.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

