Tamil Nadu: వీడియో ఇదిగో.. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కాపాడిన వీధి కుక్కలు, నిందితుడి అరెస్ట్..

తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుడియలూరు సమీపంలోని ఎన్‌జిజిఓ కాలనీ-అశోకపురం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళపై జరగబోయిన లైంగిక దాడి యత్నాన్ని వీధి కుక్కల గుంపు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి

Tamil Nadu: వీడియో ఇదిగో.. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కాపాడిన వీధి కుక్కలు, నిందితుడి అరెస్ట్..
Stray Dogs Foil S*xual Assault Attempt in Coimbatore (Photo Credits: X/@Raajeev_Chopra)

Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుడియలూరు సమీపంలోని ఎన్‌జిజిఓ కాలనీ-అశోకపురం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళపై జరగబోయిన లైంగిక దాడి యత్నాన్ని వీధి కుక్కల గుంపు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డైంది.

వీడియో ఇదిగో.. బాలుడి ప్రైవేట్ పార్టును పట్టుకుంటూ రాపిడో రైడర్ లైంగిక వేధింపులు.. మైనర్ ఫిర్యాదుపై సంస్థ స్పందన ఏంటంటే..

పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని ఉన్న ఆ మహిళ వద్దకు మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు చేరుకున్నాడు. ఆ సమయంలో ఆమె సమీపంలో రోజూ ఉండే రెండు వీధి కుక్కలు అతడిని చూసి గట్టిగా మొరగడం ప్రారంభించాయి. మొదట ఆ యువకుడు రాళ్లతో కొట్టి ఆ కుక్కలను భయపెట్టి తరిమేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఆ మహిళపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

బాధితురాలు ప్రాణభయంతో కేకలు వేయడంతో, చుట్టుపక్కల ఉన్న కుక్కలు ఒక్కసారిగా నిందితుడిపైకి లంఘించాయి. అందులో ఒక కుక్క అతడిపైకి దూకి కొరకగా, మరొకటి అతడి కాళ్లను పట్టుకుని బాధితురాలి నుంచి దూరంగా లాగేసింది. కుక్కల తీవ్రమైన దాడికి భయపడిపోయిన నిందితుడు తన ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పరుగులు తీయగా, కుక్కల గుంపు అతడిని వెంబడించింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటన క్రమాన్ని పరిశీలించిన తుడియలూరు పోలీసులు, నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆపదలో ఉన్న మహిళను సమయస్ఫూర్తితో కాపాడిన వీధి కుక్కల చొరవపై స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఆధారాలను నమోదు చేస్తూ పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2026 04:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).