Tamil Nadu Horror: ప్రియుడుతో గదిలో ఆ సీన్‌లో ఉండగా చూసిన కొడుకు, భర్తకు చెబుతాడనే భయంతో దారుణంగా హత్య చేసిన తల్లి
ప్రియుడితో గదిలో ఆ సీన్ లో ఉండగా కొడుకు చూశాడని దారుణంగా అతన్ని చంపేసింది ఓ కసాయి తల్లి, ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
Chennai, July 19: ప్రియుడితో గదిలో ఆ సీన్ లో ఉండగా కొడుకు చూశాడని దారుణంగా అతన్ని చంపేసింది ఓ కసాయి తల్లి, ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాల్లోకెళితే.. విరుదునగర్ జిల్లా వెంబకోట్ పక్కన ఎలాయి రాంపన్నాయ్ సమీపంలోని ఆర్.మడతుప్పట్టికి చెందిన గోపాల్ (45)కార్మికుడు.ఇతనికి పెళ్లయింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు పరంధామన్.
అయితే కొద్ది రోజులకు ఆమె చనిపోవడంతో అతను కౌసల్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు అప్పటికే ప్రియుడు ఉన్నాడు. ఇద్దరూ ఓ రోజు ఏకాంతంలో ఉండగా ఈ సీన్ బాలుడు చూశాడు. ఈ విషయం భర్త గోపాల్‌కి చెబుతాడేమోనని రెండో భార్య కౌసల్య భయపడి బాలుడు పరంధామన్‌ను ప్రియుడుతో కలిసి గొంతుకోసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు.
అర్థరాత్రి హిజ్రాపై తెగబడిన మందుబాబులు, మత్తు మాత్రలు ఇచ్చి దారుణంగా అత్యాచారం
కొడుకు కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మడత్తుపట్టిలోని బావిలో పరంధామన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పరంధామన్ ఆడుకుంటూ బావిలోకి జారిపడి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే కౌసల్యపై పోలీసులకు అనుమానం వచ్చింది.అలాగే ఏలాయిరం పన్నైకి చెందిన సేతు కామేష్ (35)ని కూడా పోలీసులు విచారించారు. కౌశల్యకు కామేష్‌తో వివాహేతర సంబంధం ఉందని వెలుగులోకి వచ్చింది. సోమవారం కౌసల్యను పోలీసులు పట్టుకుని విచారించారు. ఇందులో బాలుడిని చంపినట్లు నేరం ఒప్పుకుంది. హత్యకు సహకరించిన సేతు కామేష్ కోసం గాలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

