Representative image (Photo Credit- Pixabay)

Chennai, July 19: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బరితెగించిన కామాంధులు మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పెరంబూరు ప్రాంతానికి చెందిన జన్నీ, బ్లసికా హిజ్రాలు. వీరిద్దరూ సోమవారం రాత్రి మధురవాయిల్‌ పూందమల్లి హైవే రోడ్లు జీసస్‌ కాల్స్‌ వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన మద్యం మత్తులో వున్న ఇద్దరు బ్లసికాతో మాటలు కలిపారు. తర్వాత హఠాత్తుగా కత్తిని చూపెట్టి బ్లసికాను ఆటోలు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది.

 ఏపీలో దారుణం, గిరిజన యువకుడి నోట్లో పురుషాంగం పెట్టి మూత్రం పోసిన దుండగులు

ఇది చూసి జన్నీ వెంటనే మధురవాయిలు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ సుబ్రమని సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సెట్టియార్‌ అగరం ప్రాంతంలో వున్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆవడికి చెందిన జగన్, రామాపురానికి చెందిన దినేష్ లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి బ్లసికాను విడిపించారు. ఆ సమయంలో మత్తు మధ్యలో యువకులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహారాజాపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయత్నిచారు. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. బ్లసికాను చికిత్స కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు.