Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, ఒకే కుటుంబంలో నలుగురిని కొడవళ్లతో నరికి చంపిన కొందరు వ్యక్తులు, ప్రణాళిక ప్రకారమే హత్య అని పోలీసులు అనుమానాలు

తమిళనాడులోని తిరుప్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కొందరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.తిరుప్పూర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ ముఠా హత్య చేసింది.

Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, ఒకే కుటుంబంలో నలుగురిని కొడవళ్లతో నరికి చంపిన కొందరు వ్యక్తులు, ప్రణాళిక ప్రకారమే హత్య అని పోలీసులు అనుమానాలు
Murder (Photo Credits: Pixabay)

Tiruppur, Sep 4: తమిళనాడులోని తిరుప్పూర్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కొందరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు.తిరుప్పూర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ ముఠా హత్య చేసింది.

పల్లడం సమీపంలోని కల్లకినారులో హోల్‌సేల్ బియ్యం దుకాణం యజమాని సెంథిల్ కుమార్ (47) తన భూమిలో మద్యం సేవిస్తున్న కొంతమంది వ్యక్తులను ప్రశ్నించారని, ఇది కుమార్, అగంతకుల మధ్య వాగ్వాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు అతనిపై కొడవళ్లతో దాడి చేశారు.

దీన్ని గమనించిన సెంథిల్‌ కుటుంబ సభ్యులుమోహన్‌రాజ్‌, రత్నాంబల్‌, పుష్పవతి అతన్ని కాపాడేందుకు అక్కడికి వెళ్లగా నిందితులు.. వీరిపై సైతం కిరాతకంగా దాడి చేయడంతో నలుగురు అక్కడికక్కడే కుప్పకూలారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సెంథిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మరో ముగ్గురి మృతదేహాలను తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.

వణికిస్తున్న హార్ట్ ఎటాక్ మరణాలు, తాజాగా గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి, జార్జియాలో ఏపీ MBBS విద్యార్థి మృతి

నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.ప్రణాళిక ప్రకారమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2023 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).