Thane Shocker: దారుణం, తండ్రి స్నాప్‌చాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోనివ్వలేదని బాలిక ఆత్మహత్య, బెడ్‌రూంలో ఉరివేసుకుని సూసైడ్

ముంబైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన మొబైల్ ఫోన్‌లో మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని తండ్రి కోరడంతో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుందని సోమవారం పోలీసులు తెలిపారు.

Thane Shocker: దారుణం, తండ్రి స్నాప్‌చాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోనివ్వలేదని బాలిక ఆత్మహత్య, బెడ్‌రూంలో ఉరివేసుకుని సూసైడ్
Dies (Rep Image)

Mumbai, June 24: ముంబైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన మొబైల్ ఫోన్‌లో మెసేజింగ్ యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని తండ్రి కోరడంతో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుందని సోమవారం పోలీసులు తెలిపారు. డోంబివిలీ ప్రాంతంలోని నీల్జేలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. ఆ యువతి తన మొబైల్ ఫోన్‌లో స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది.   వీడియో ఇదిగో, నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, చావు బతుకుల్లో ఆస్పత్రిలో..

అలా చేయవద్దని ఆమె తండ్రి కోరడంతో ఆమెకు కోపం వచ్చిందని మాన్‌పాడ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక ఆ రాత్రి తన గదిలోకి వెళ్లిపోయింది. చివరకు గదిలోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృ‌తదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

(The above story first appeared on LatestLY on Jun 24, 2024 11:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).