Times Now-ETG Survey: టైమ్స్ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..
దేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ Times Now-ETG Survey తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది
దేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ Times Now-ETG Survey తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీ విషయానికి వస్తే.. 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వే ఉద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 24 నుంచి 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ ఈసారి దాదాపు మొత్తం సీట్లను కైవసం చేసుకుంటుందని సర్వేలో వెల్లడయింది. అంతేకాదు 51.10 శాతం ఓట్లు దక్కించుకుంటుందని స్పష్టం చేసింది.
ఇక ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉంది. ఆ పార్టీకి 36.40 శాతం ఓట్లు లభిస్తాయి. జనసేన పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదు. కేవలం 10.10 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీకి కనాకష్టంగా 1.30 శాతం ఓట్లు పడతాయని అంచనా. ఇతరులు 1.10 శాతం ఓట్లు సాధించనున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత ఈ సర్వే జరిగింది.
ఇక తెలంగాణలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయని సర్వే నివేదిక తెలిపింది. 17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో 9 నుంచి 11 సీట్లు తన ఖాతాలో వేసుకోనుందని సర్వే తెలిపింది.ఇతరులు మరో స్థానం దక్కించుకోబోతున్నారు.
80 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకు 70 నుంచి 74 సీట్లు లభిస్తాయని సర్వే బహిర్గతం చేసింది. ఇండియా కూటమికి 4 నుంచి 8, బహుజన సమాజ్ పార్టీకి ఒకటి, ఇతరులకు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Oct 03, 2023 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

