Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు
Andhra Pradesh DGP Dwaraka Tirumala Rao and Tirupati Laddu (Photo/Wikimedia Commons and X)

Vjy, Oct 1: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

గత మూడు రోజులుగా సిట్ సభ్యులు తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. అయితే నేడు సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబరు 3) అనంతరం, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ వివరించారు.

తిరుపతి లడ్డూ వివాదంపై హీరో సుమన్, లడ్డూ కల్తీ నిజమని తేలితే ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్‌ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారు.

తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్‌ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్‌ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్‌ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on Oct 01, 2024 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).