Jagan Press Meet: దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడిన వైఎస్‌ జగన్‌

తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.

Jagan Press Meet: దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడిన వైఎస్‌ జగన్‌
YS Jagan Mohan Reddy on Laddu (photo/X/YSRCP)

Vjy, Sep 27: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. దేవుడి దగ్గరకు వెళ్తుంటే అడ్డుకునే కార్యక్రమాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

జగన్ తో పాటు వెళ్లేందుకు అనుమతి లేదని వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇది రాక్షస రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. వంద రోజుల ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ తిరుమల పర్యటన రద్దు, తిరుపతి పర్యటన పూర్తి వివరాలపై కాసేపట్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్న వైసీపీ అధినేత

ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని... ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని... మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.

తప్పులు చేయలేని విధంగా టీటీడీ వ్యవస్థ ఉంటుందని జగన్ చెప్పారు. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులే టీటీడీ బోర్డులో ఉంటారని... వారే నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. టీటీడీ టెండర్ల ప్రక్రియలో బోర్డుకు ప్రమేయం ఉండదని చెప్పారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికే ఆర్డర్లు ఇస్తారని తెలిపారు.

టీటీడీ చరిత్రలో తొలిసారి లడ్డూ శాంపిల్ ను గుజరాత్ లోని ల్యాబ్ కు పంపించారని అన్నారు. ‘‘వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చి అడ్డుకున్నారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. దర్శనానికి వెళ్తామంటే అరెస్ట్‌ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘వేలాది మంది పోలీసులను మోహరించారు. లడ్డూ వివాదంలో డైవర్షన్‌ కోసమే ఇవన్నీ చేస్తున్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ బాబు అడ్డంగా దొరికిపోయారు. రాజకీయ దుర్భుద్ధితోనే లడ్డూ విశిష్టతను దెబ్బ తీశారు. జంతువుల కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఆరు నెలకొకసారి నెయ్యి కొనుగోలు టెండర్లు జరుగుతాయి. ఎల్‌1 ఎవరొచ్చారో వారికే టెండర్లు ఇస్తారు.

దశాబ్ధాలుగా ఈ ప్రక్రియనే జరుగుతూ ఉంది. ప్రతి ట్యాంకర్‌ ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ తేవాలి. ట్యాంకర్‌ వచ్చాక కూడా టీటీడీ 3 టెస్టులు చేస్తుంది. ఒక్క టెస్ట్‌ ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారు. బాబు హయాంలో కూడా 15 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపారు. మా హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపాం. తిరుమలలో ఇంత గొప్ప వ్యవస్థ ఉంది.’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

‘‘జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్‌ అయ్యాయి. టెస్టులు ఫెయిల్‌ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్‌ అయితే మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ మొదటిసారిగా ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు.’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

(The above story first appeared on LatestLY on Sep 27, 2024 04:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).