Tomato Prices: అక్కడ కిలో టమాటా రూ. 79, సామాన్యులకు ఊరట కలిగించేలా తమిళనాడు సర్కారు నిర్ణయం, మహారాష్ట్ర నుంచి టమాటా తెప్పిస్తున్న స్టాలిన్

తమిళనాడులో కిలో టమాటా రేటు రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. టమాటా ధరల కట్టడికి స్టాలిన్ సర్కారు విస్తృత చర్యలు చేపట్టింది.

Tomato Prices: అక్కడ కిలో టమాటా రూ. 79, సామాన్యులకు ఊరట కలిగించేలా తమిళనాడు సర్కారు నిర్ణయం, మహారాష్ట్ర నుంచి టమాటా తెప్పిస్తున్న స్టాలిన్
Tomato . (Photo Credits: Pixabay)

Chennai November 25: టమాటా ధర చూసి సామాన్యులకు కళ్లు తిరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టమాటా ధర సగటున రూ.120 దాటింది. కొన్ని ప్రాంతాల్లో అయితే టమాటా రేటు రూ. 140 వరకు ఉంది. ఇక తమిళనాడులో కిలో టమాటా రేటు రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. టమాటా ధరల కట్టడికి స్టాలిన్ సర్కారు విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు.

ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది తమిళనాడు సర్కారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి.

కొన్నిరోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పటికే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్‌లో టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ టమాట ధర రూ.100 దాటింది.

(The above story first appeared on LatestLY on Nov 25, 2021 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).