UIDAI Extended Date: ఫ్రీగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు మరో ఛాన్స్‌, సెప్టెంబర్ 14వరకు ఆధార్‌ ఉచితంగా మార్చుకునే అవకాశం

ఆధార్‌ కార్డులో (Update Aadhaar) వివరాలు ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? పేరు, అడ్రస్‌ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిపోయిందని బాధపడుతున్నారా? మీకోసమే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు సెప్టెంబర్‌ 14వ తేదీ వరకు గడువు పొడిగించింది.

UIDAI Extended Date: ఫ్రీగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు మరో ఛాన్స్‌, సెప్టెంబర్ 14వరకు ఆధార్‌ ఉచితంగా మార్చుకునే అవకాశం
Aadhar (Photo Credits: Google)

New Delhi, June 16: ఆధార్‌ కార్డులో (Update Aadhaar) వివరాలు ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? పేరు, అడ్రస్‌ వంటి వివరాల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిపోయిందని బాధపడుతున్నారా? మీకోసమే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు సెప్టెంబర్‌ 14వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆధార్‌లో వివరాలు మార్చుకునేందుకు మార్చి 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు UIDAI తొలుత అవకాశం కల్పించింది. బుధవారంతో ఆ గడువు ముగిసింది. అయినా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోని వాళ్లు ఇంకా చాలామందే మిగిలిపోయారు. ఈ క్రమంలోనే ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఈసారి గడువు ముగిస్తే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆధార్‌ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో, వారు అనేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తున్నది. దీనిపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆధార్‌ కార్డుల సవరణతోపాటు అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

No Egg, No Sperm Needed For Baby? వీర్యం లేకుండా పిల్లాడు పుట్టే కొత్త టెక్నాలజీ, స్టెమ్ సెల్స్ సహాయంతో ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మానవ పిండం తయారు చేసిన శాస్త్రవేత్తలు 

2014 కంటే ముందు ఆధార్‌ పొందిన వారు తమ వివరాలను అప్డేట్‌ చేసుకోవాలని సూచిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్‌14 వరకు గడువు కూడా విధించింది. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్‌ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్‌ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(UIDAI) సూచిస్తున్నది.

YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్, 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే మానిటైజేషన్‌, వాచ్‌ అవర్స్‌ కూడా 3వేలు గంటలకు తగ్గింపు 

ప్రధానంగా 2010 -18 వరకు ఆధార్‌ నమోదు చేసుకున్న కార్డుదారులు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు తండ్రి పేరిట ఉన్న మహిళల కార్డులు వివాహానంతరం భర్త పేరు మార్చుకునేందుకు గతంలో వీలు లేకుండే, దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటిని కూడా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. డబ్భు ఏళ్లు దాటిన వారికి నవీకరణలో మినహాయింపునిచ్చారు. తప్పొప్పులు సవరించుకునే వారు తమ పదో తరగతి, పాన్‌, ఓటర్‌ కార్డు, పాస్‌ పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాల్సి ఉంటుంది. అందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్‌ కార్డు జారీ చేశారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్‌లైన్‌లో స్వతహాగా కూడా అప్డేట్‌ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. మై ఆధార్‌ పోర్టల్‌, ఎం-ఆధార్‌ యాప్‌ ద్వారా myaadhaar.uidai.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి. ఆధార్‌ అప్డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్‌ అప్డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్లోడ్‌ చేయాలి. అనంతరం చిరునామా నిరూపించే పత్రాన్ని అప్‌లోడ్‌ చేసి సమర్పించాలి. వెంటనే ఆధార్‌ అప్డేట్‌ పూర్తయినట్లు ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వస్తుంది.

ఆధార్‌ సెంటర్లలో కార్డుల నవీకరణ కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు. బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం 100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు 50, ఆధార్‌ డౌన్‌ లోడ్‌, కలర్‌ ప్రింట్‌కు 30 చెల్లించాలి. అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా, అదనంగా డబ్బులు వసూలు చేసినా, సంబంధిత ఆధార్‌ సెంటర్‌ కోడ్‌ నెంబర్‌తో టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

(The above story first appeared on LatestLY on Jun 16, 2023 10:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).