Viral Video: బుల్డోజర్ ఎక్కి ఊరంతా ఊరేగిన నూతన దంపతులు...యూపీలో వీడియో వైరల్..ఇదెక్కడి వింత అంటున్న నెటిజన్లు..

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన వివాహ వేడుకల కోసం ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కృష్ణ వర్మ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి తన వివాహం అనంతరం నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సందర్భంగా బుల్డోజర్ ఎక్కి ఊరందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు.

Viral Video: బుల్డోజర్ ఎక్కి ఊరంతా ఊరేగిన నూతన దంపతులు...యూపీలో వీడియో వైరల్..ఇదెక్కడి వింత అంటున్న నెటిజన్లు..
File: x

వెర్రి వెయ్యి విధాలు అన్నారు పెద్దలు అలాగే వార్తల్లో వ్యక్తులుగా నిలవడం కోసం కొంతమంది వింత వింత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో తమను తాము ప్రత్యేకంగా నిరూపించుకునేందుకు వైరల్ గా అయ్యేందుకు వింత చేష్టలు చేస్తూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన వివాహ వేడుకల కోసం ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కృష్ణ వర్మ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి తన వివాహం అనంతరం నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సందర్భంగా బుల్డోజర్ ఎక్కి ఊరందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు. వధూవరులు ఇద్దరు బుల్డాజర్ లో కూర్చుని ఇంటికి వెళ్లారు.

అయితే ఉత్తర ప్రదేశ్ లో బుల్లోజర్లకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచూ తన రాజకీయ ప్రత్యర్థులను బుల్డోజర్లతో వారిని ఇండ్లను నిర్మాణాలను కూల్చి వేస్తానని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ ప్రత్యర్థులు అదేవిధంగా పలువురిపై ఈ బుల్డోజర్ అస్త్రం ఆయన పలుమార్లు ప్రయోగించారు.

(The above story first appeared on LatestLY on Jul 10, 2024 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).