Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

లక్నో,నవంబర్ 10: నలుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన ఒక మహిళ.. తనను వేధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

హర్దోయ్‌లో ఐదు నెలలుగా మహిళను పదేపదే లైంగికంగా వేధించినట్లు నలుగురు పురుషులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారు ఈ చర్యను కెమెరాలో రికార్డ్ చేసి, ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆమె తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించింది, అయితే సకాలంలో రక్షించబడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు.

బెంగుళూరులో దారుణం, సహజీవనం చేస్తున్న జంట మంటల్లో సజీవ దహనం, దర్యాప్తులో ఏం తేలిందంటే..

ఇ-రిక్షా డ్రైవర్ అయిన తన భర్త పని కోసం బయటకు వెళ్లిన సమయంలో దుండగులు తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తుపాకీతో బందీగా ఉంచారని మహిళ తెలిపింది. చంపేస్తామని బెదిరించి, అత్యాచారం చేస్తూ వీడియో చిత్రీకరించారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తరచూ ఆమెను తమ ఇళ్లకు పిలిపించి లైంగికంగా కోరికలు తీర్చుకునేవారు. ఆమె నిరాకరించినప్పుడల్లా వీడియోను లీక్ చేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు.

"తన ఇంట్లో నలుగురు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, వీడియో రికార్డ్ చేశారని మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని హర్దోయ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దుర్గేష్ సింగ్ తెలిపారు.